చాలా మంది కుటుంబాలలో ఎంత శ్రమించినా,ఎన్ని వ్యాపారాలు చేసినా డబ్బు వస్తూ ఉంటుంది.కానీ అది నెల తిరిగే లోపు ఎలా ఖర్చు అయుంటుందో వారికే తెలియకుండా ఉంటుంది.మళ్ళీ మొదలయ్యే లోపు అప్పులు కూడా చేయవలసి వస్తుంది.దీనికి కారణం మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీనే అని చెప్పవచ్చు.అంతే కాక నెగటివ్ ఎనర్జీ కారణంగా ఉద్యోగంలో ప్రమోషన్ రాకపోవడం పిల్లల్లో వెనుకబాటుతనానికి గురి కావడం,పెద్దల్లో ఆరోగ్య సమస్యలు వంటివి మొదలవుతూ ఉంటాయి.అలాంటి సమస్యలు ఎదుర్కొనేవారు అమావాస్య రోజున చేసే ఇంటి నివారణలు దృష్టి దోషాలను పోగొట్టడమే కాకుండా,ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ కూడా పారద్రోలుతాయి.అవేంటో మనము తెలుసుకుందాం పదండి..

ప్రతి అమావాస్య రోజున ప్రధాన గుమ్మానికి తప్పకుండా పూజ చేసి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి.అంతేకాక నెగిటివ్ ఎనర్జీ మరియు దృష్టి దోషాలు ఇంట్లోకి రాకుండా ఒక పసుపు బట్ట తీసుకొని,అందులో రెండు స్పూన్ల ఉప్పు, నాలుగు లేదు ఐదు లవంగాలు,ఒక స్పూన్ మిరియాలు, పసుపు,కుంకుమ వేసి మూట కట్టాలి.ఆ మూటను ప్రధాన గుమ్మానికి కట్టి,అగరబత్తీలను చూపించాలి. మరియు ఆ రోజు ఇల్లంతా శుభ్రం చేసుకుని,ఇంట్లో దూపం వేయాలి.ఇలా ప్రతి అమావాస్య రోజు చేయడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ బయటికి పారిపోతుంది.మరియు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు సమస్యలు తగ్గి వారు అనుకున్న పనులు సజావుగా జరుగుతాయి.ధనం కూడా నిలువ ఉంటుంది.

మరియు ఇంటి ప్రధాన గుమ్మానికి దిష్టి గణపతిని ఉంచుకోవడం మంచిది.ఎందుకంటే గణపతి ఎలాంటి విజ్ఞానాలైనా తొలగించడానికి ముందుంటాడు కనుక. అదేవిధంగా ప్రధాన గుమ్మం ఎదురుగా తులసి చెట్టును ఉంచుకోవడం తప్పనిసరి.

హిందూ సంప్రదాయంలో స్వస్తిక్ కి ప్రత్యేక స్థానం ఉంది.ఇంటి ప్రధాన గుమ్మానికి ఇరువైపులా పసుపు రంగు స్వస్తిక్ వేసి,కుంకుమ పెట్టడం వల్ల ఇంటి వాస్తు,ద్రుష్టి దోషాలు తొలగిపోతాయి.ప్రధాన తలుపుకి మధ్యలో నీలిరంగు స్వస్తిక్ గుర్తు ఉంచడం వల్ల ఇంట్లోని వారి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.కావున మీరు ఈ అమావాస్య రోజున ఈ నివారణ పాటించి,ఇంట్లో ధనాన్ని నిలుపుకొని, వృద్ధిలోకి రండి.

మరింత సమాచారం తెలుసుకోండి: