మన చుట్టూ ఉండే మొక్కలలో  పలు రకాల ఉపయోగాలు ఉండనే ఉంటాయి..పల్లెల్లో ఉండే ప్రజలకు ఈ గురువింద గింజలు కచ్చితంగా చూసి ఉంటారు. ఇది చూడడానికి ఎరుపుగా కనిపిస్తూనే కాస్త నల్లటి రంగు ఆకారంలో కనిపిస్తూ ఉంటుంది.. తీగ జాతికి చెందిన ఈ గింజలు ఎక్కడైనా మొలుస్తూ ఉంటాయి. చూడడానికి అందంగా కనిపించే ఈ గింజలు ఇంట్లో ఉంటే మంచిదని పలువురు పండితులు సైతం తెలియజేస్తున్నారు. వాటి గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.


ఈ గురువింద గింజలు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఎక్కువగా లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తాయని పండితులు సైతం తెలియజేస్తున్నారు. ఇవీ చూడడానికి అందంగా చాలా గట్టిగా ఉంటాయి. అయితే ఇవి తినడానికి చాలా ప్రమాదమని నిపుణులు సైతం హెచ్చరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు వీటికి చాలా దూరంగా ఉంచడం మంచిది పొరపాటున కూడా వీటిని నోట్లో వేసుకున్నట్లు అయితే వారి యొక్క నాడి వ్యవస్థ మండలం పైన తీవ్రమైన ప్రభావం చూపుతోందట. తద్వారా చలనం కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు వీటిని ఎక్కువ మోతాదులో వేసుకుంటే కచ్చితంగా ప్రాణాపాయం కూడా ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు.


గురువింద గింజలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి వాటిలో ఇది కూడా ఒకట పూర్వపు రోజుల్లో బంగారాన్ని ఈ గింజలతో తూసేవారట. అందుచేతనే ఇవి లక్ష్మీదేవికి చాలా ఇష్టమని కొంతమంది పండితులు తెలుపుతున్నారు.అందుచేతనే చాలామంది పూర్వీకులు కూడా ఈ గింజలను లక్ష్మీదేవికి స్వరూపంగా భావించేవారు. అయితే ఈ గురువింద గింజలను సైతం కొన్ని ప్రాంతాలలో  పూజలో కూడా వినియోగిస్తూ ఉంటారు. వీటిని పూసలుగా అల్లుకొని మెడలో వేసుకున్నట్లు అయితే ఇలాంటి దుష్ట శక్తి కూడా దరికి చేరదని పూర్వీకులు సైతం ఎక్కువగా నమ్మేవారు. అందుచేతనే మన పూర్వీకులు సైతం ఎక్కువగా మొలతాడులోని ఈ గింజను ఎక్కించి చిన్నపిల్లలకు కట్టేవారు.

మరింత సమాచారం తెలుసుకోండి: