పూర్వం నుంచి మనం ఆచరించే సాంప్రదాయాలు పద్ధతులు వెనుక ఎన్నో రకాల రహస్యాలు ఉన్నాయి. అటువంటి కొన్ని రకాల నమ్మకాల వల్లనే మన జీవితం కొనసాగుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు.మరీ ముఖ్యంగా కొన్ని రకాల జంతువులు మన ఇంట్లో మన గడప దాటుతూ ఉన్నట్లు కనిపిస్తే,లక్ష్మీదేవి మన తలుపు తడుతున్నట్లు భావించాలని,వాస్తుశాస్త్రం చెబుతుందని వేద పండితులు కూడా చెబుతున్నారు. అసలు ఎలాంటి జంతువులు మన గుమ్మం ఎదుట కనిపించడం వల్ల,మనల్ని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందో మనము తెలుసుకుందాం పదండి..

 నల్ల చీమలు..

ఎక్కడైనా తీపి పదార్థాలు ఉంటే కచ్చితంగా ఎర్ర చీమలు అనేవి వస్తూ ఉంటాయి.కానీ నల్ల చీమలు చాలా అరుదుగా కనిపిస్తాయి ఎందుకంటే నల్ల చీమలు మన ఇంట్లో ఏదో శుభం కలుగుతుందిఅన్నప్పుడు మాత్రమే ఎక్కువగా కనిపిస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.కావున ఈసారి మీ ఇంట్లో నల్ల చీమల దండు కనిపిస్తే కచ్చితంగా వాటికి ఆహారం ఇచ్చి కాపాడండి.దానివల్ల మీకు చాలా సంపద కలుగుతుంది.


చిలుక..

వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటికి చిలుక వసున్నట్టు మీకు కనిపిస్తే,అది చాలా శుభసూచకంగా పరిగణించబడుతుంది.సాధారణంగా చిలుక సంపదకు దేవుడు అయిన కుబేరునితో సంబంధం కలిగి ఉంటుందని నమ్ముతారు.

తాబేలు..

వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంటికి తాబేలు వస్తే అది శుభసూచకం.మత గ్రంథాలలో జలచరాలకు ప్రత్యేక పాత్ర ఉంది.తాబేలు విష్ణువు యొక్క కూర్మఅవతారంగా పరిగణించబడుతుంది.ఇంట్లోకి దాని రాక లక్ష్మీ దేవిని సంతోషపరుస్తుంది.మరియు ఆనందం,శ్రేయస్సు మరియు శాంతిని కలిగిస్తుంది.

రెండు తలల పాము..

రెండు తలల పాము చాలా అరుదైన కనిపించే జీవి. లక్ష్మీదేవిని మోసే వాహనంగా భావిస్తారు.ఒక వేళ మీ ఇంట్లోకి రెండు తలల పాము వస్తే ఇక అదృష్టం వరించినట్టే.అంతే కాక ఇంట్లో శ్రేయస్సు,విజయం, సంపద మరియు ఆనందాన్ని కూడా తెస్తుంది.మరీ ముఖ్యంగా ఎవరికీ హాని కలుగదు.

ఆవు..

హిందూ సంప్రదాయంలో ఆవుకు ఎంతో పవిత్రమైన స్థానం వుంది.అంతేకాక లక్ష్మి దేవికి ప్రతిరూపంగా భావిస్తారు కూడా.అటువంటి ఆవు మన ఇంట్లోకి వస్తున్నట్టు కనిపిస్తే దానికి కచ్చితంగా ఆహారం పెట్టి పంపడం వల్ల,లక్ష్మిదేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: