హిందువులు ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగలలో దసరా పండుగ కూడా ఒకటి.. దసరా చివరి రోజున విజయదశమిని చాలా గ్రాండ్గా జరుపుకుంటారు. ఈ రోజుకి చాలా విశిష్టత ఉన్నది.. ఆరోజు శమీ వృక్షం అంటే జమ్మి చెట్టుకి పూజలు చేయడం చాలా మంచిదని పలువురు పండితుల సైతం తెలియజేస్తున్నారు. అయితే ఈ చెట్టుకి ఎందుకు పూజ చేయాలి అసలు విజయదశమి వృక్షానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు వాటి గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..


శమీ వృక్షం పాపాన్ని హరిస్తుందట. శత్రువులను నాశనం చేయడానికి మహాభారతంలో పాండవులకు సైతం శమీ వృక్షం సహాయం చేసిందని పండితుల సైతం తెలియజేస్తున్నారు.. శమీ వృక్షం సువర్ణ వర్షాన్ని కురిపిస్తుందని మన శాస్త్రాల ఉన్నట్లుగా తెలుపుతున్నారు పండితులు.. అందుకే విజయదశమి రోజున పూజలో జమ్మి చెట్టుకు చేస్తే ఆ ఆకులను ఇంట్లో పూజ స్థలంలో ఉంచిన ధనస్థానంలో ఉంచిన ఆ ఇల్లు చాలా అభివృద్ధి చెందుతుందని నమ్మకం ఉంటుంది.. పరమశివుడు కుమారుడీ  సిద్ది ప్రదాత వినాయకుడికి శమి ప్రతి సమర్పించే ఆచారం చాలా ఆనవాయితీ గానే వస్తున్నది.


అంతేకాకుండా జమ్మి చెట్టు కాడలు రాపిడి ద్వారా సృష్టించే అగ్గితో పూర్వము మన పండితులు సైతం యజ్ఞయాగాలకు సైతం ఉపయోగించే వారట. ఇప్పటికి అనేక దేశాలలో అనేక ప్రాంతాలలో కూడా ఈ జమ్మి చెట్టు వృక్షం లో అగ్గి దాగి ఉంటుందని నమ్మకాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అందుకే దేవాలయాల ప్రతిష్ట సమయంలో కూడా ఖచ్చితంగా జమ్మి చెట్టు బెరడులను అగ్ని హోమం వంటివి చేస్తూ ఉంటారు.. పాండవులు అజ్ఞాతవాసం చేయాలని సంకల్పించిన తర్వాత తమ ఆయుధాలను ఈ జమ్మి చెట్టు మీద ఊహించడం జరిగింది.. అజ్ఞాతవాసం ముగిసే సమయానికి శమీ వృక్షానికి చేరి తాము దాచి ఉంచిన ఆయుధాలను సైతం ధరించి శత్రువులతో యుద్ధం చేసి విజయం సాధించారు కనుక ఈ జమ్మి చెట్టుకి అంతటి విశిష్టత కలిగి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: