ఈ ఏడాది రెండవసారి చంద్రగ్రహణం ఈనెల 29వ తేదీన రాబోతోంది. అక్టోబర్ 14 నుంచి సూర్యగ్రహణం తర్వాత 14 రోజుల తర్వాత ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుందని పండితులు సైతం తెలియజేస్తున్నారు. సూర్యుని చుట్టూ భూమి భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నప్పుడు ఇలా రెండు ఒకేసారి సూర్యునితో ఒకే అంశం పైన ఉన్నప్పుడే ఇది కనిపిస్తుందట. ఒకే అంశంపై సూర్యునికి చంద్రునికి మధ్య భూమి కూడా వస్తుందని ఈ స్థితిలోనే సూర్యుని కాంతి భూమి అడ్డుపడుతుందని భూమి నీడ చంద్రునిపై పడడం వల్ల చంద్రుడు అసలు కనపడని ఇదే చంద్రగ్రహణమట.


భూమికి అతి దగ్గరగా ఉండే గ్రహం చంద్రుడు.. చంద్రుడు జలగ్రహం.. చంద్రుని ఆకర్షించే శక్తి భూమి పైన ఉండే జలవర్గం పైన చాలా ప్రభావం చూపుతుందట. మానవుని శరీరంలో కూడా 80 శాతం నీరు ఉండడం వలన ఉద్రేకానికి గురి అవుతారు.. కేవలం మామూలు రోజులలోనే ఇది ఎక్కువగా ఉన్నప్పుడు గ్రహణం సమయంలో ఈ ఆలోచనలు చాలా విపరీత స్థాయికి చేరుతాయట. అందువలన గ్రహణం సమయంలో కేవలం జపాలు చేసుకుంటూ ఎక్కడికి బయటికి వెళ్లకుండా ఉంటారు. ఇలాంటి సమయంలోనే పలు రకాల నియమాలను పాటించమని చెబుతూ ఉంటారు.


ముఖ్యంగా ఆహార నియమాలలో గ్రహణం పట్టడానికి తొమ్మిది గంటల ముందు గ్రహం విడిచే వరకు ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదని పలువురు పండితులు సైతం తెలుపుతుంటారు శరీరంలో 80 శాతం నీరు నిండి ఉన్నందువలన.. శరీరం పై ఈ ప్రభావం చాలా చూపుతుంది.. మూత్ర కోశాలు మెదడు మొదలైన వాటిలో అల్లకల్లోలం జరుగుతూ ఉంటాయట ఈ పరిణామం అప్పుడే కనపడదు రాను రాను రోజుల్లో కనిపిస్తుందట. గ్రహణం సమయంలో ఏదైనా తిన్న తర్వాత ఆహారం జీర్ణం కాకుండా ఉంటే అది వ్యతిరేక శక్తిని కలిగిస్తుంది. గ్రహణం సమయంలో ఎలాంటి ఆహారాన్ని కూడా ముట్టుకోకూడదు.. ముఖ్యంగా స్నానం కూడా చేయకూడదని పండితులు తెలుపుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: