కార్తీక మాసం చాలా మందికి ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు.. అయితే ఈ కార్తీకమాసంలో ఎక్కువగా పూజలు పునస్కారాలు వంటివి చేస్తూ ఉంటారు.. అయితే ఎక్కువగా దీపాలను సైతం వెలిగిస్తూ ఉంటారు. దీపాలని వెలిగించేటప్పుడు పలు నియమాలను సైతం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.అయితే దీపం వెలిగించేటప్పుడు చాలా మంది కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు.. దీనివల్ల సరైన ఫలితం కూడా దక్కదు. అంతేకాకుండా ఎన్నో సమస్యల సైతం ఎదుర్కోవాల్సి వస్తుందని హిందూ పురాణాలలో తెలియజేయడం జరిగింది.


దీపాలను  స్వచ్ఛంగా వెలిగించాలి.. స్వచ్ఛమైనవిగా అంటే గతంలో ఎప్పుడు ఉపయోగించని నూనెను వత్తులను శుభ్రమైన దీపాన్ని సైతం పెట్టడాన్ని స్వచ్ఛమైన దీపంగా తెలియజేస్తారు. పాత వాటిని కూడా అసలు ఉపయోగించుకోకూడదు.


ముఖ్యంగా శివుడి ముందు దీపాలను వెలిగించడానికి సైతం.. ఇత్తడి, రాగి మట్టితో చేసిన దీపాలను మాత్రమే ఉపయోగించాలి. ఇది చాలా పవిత్రమైనదిగా మనం భావిస్తూ ఉంటాము. ఇతర లోహాలతో తయారుచేసిన వాటిని అసలు ఉపయోగించకూడదు.


అయితే దీపారాధన చేసేటప్పుడు కేవలం వట్టి దీపారాధన మాత్రమే వెలిగించకుండా.. ముందుగా పసుపు బియ్యం పూలరేకులు వేసి ఆ తర్వాత నెయ్యి నువ్వుల నూనె కలిపిన దీపాలను సైతం వెలిగించాలి. చాలా మంది తమకు తెలియకుండానే.. అన్ని దేవతల ముందు పది రకాల దీపాలను సైతం వెలిగిస్తూ ఉంటారు అయితే కొన్ని నూనె దీపాలను కొన్ని ప్రత్యేకమైన రోజులలో మాత్రమే దేవతలకు అంకితం చేయవలసి ఉంటుందట. అందుచేతనే దీపాలను వెలిగించేటప్పుడు పండితులను సైతం కనుక్కొని వెలిగించడం మంచిది.


జ్యోతిష్యులు తెలిపిన ప్రకారం కార్తీక మాసం రోజున దీపాలను వెలిగించడం వల్ల పలు రకాలుగా ప్రయోజనాలు పొందవచ్చట.. ముఖ్యంగా ఇంటిని అలంకరించుకొని ఉదయాన్నే లేచి తల స్నానం చేసి ఏదైనా శివుడి దేవాలయం దగ్గర ఆవు నెయ్యితో దీపాలను వెలిగిస్తే మంచి జరుగుతుందట. ముఖ్యంగా దీపాలను వెలిగించేటప్పుడు పలు నియమాలను పాటించాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: