మన పూర్వీకుల సైతం ఎక్కువగా పలు రకాల పద్ధతులను పాటించేవారు. ముఖ్యంగా గోమాతను దేవతగా పూజించేవారు.గోమూత్రంని కూడా ప్రతివారం ఇంటి లోపల బయట చల్లుతూ కాస్త తీసుకుంటూ సేవించేవారు. అయితే ఆరోగ్య నిపుణులు కూడా గోమూత్రం తాగడం అనేది చాలా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని తెలియజేస్తున్నారు. ఆవు మూత్రం ద్వారా క్యాన్సర్ ను సైతం దూరం చేస్తుందని చాలా మంది నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు.. మరి నిజంగానే గోమూత్రం రోగాలను స్వయం నయం చేస్తుందా దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటనే విషయాలను తెలుసుకుందాం.


కొంతమంది పరిశోధకులు తెలిపిన ప్రకారం ఆవు మూత్రంతో క్యాన్సర్ ను నయం చేయడం సాధ్యం కాదట కానీ గోమూత్రం తాగే  వారు క్యాన్సర్ లాంటి వ్యాధి నుంచి కూడా బయటపడిన వారిని ఇంతవరకు చూడలేదని ఆవు మూత్రంలో క్యాన్సర్ను నిర్మూలించే మూలకం అసలు లేదని నిపుణులు తెలుపుతున్నారు. ఆవు మూత్రంలో 95% నీటిలో పొటాషియం ఫాస్పరస్ సోడియం ఇతరత్న ఖనిజాలు ఉన్నాయని తెలుపుతున్నారు. ఇందులో ఏవి కూడా క్యాన్సర్ని నిరోధించే కారకాలు కావని కూడా తెలియజేశారు. పంటలను సారవంతంగా చేసేందుకు పొలాల్లో ఎక్కువగా గోమూత్రాన్ని ఉపయోగిస్తూ ఉంటారు


ఆయుర్వేదం ప్రకారం గోమూత్రంలో ఉబకాయాన్ని తగ్గించే పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల బరువు కూడా తగ్గుతారట ఆవు మూత్రం జీర్ణ వ్యవస్థను సైతం మెరుగుపరిచేలా చేస్తుంది..అలాగే ఆవు మూత్రాన్ని చర్మ సంరక్షణకు కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. మొటిమలు ఉన్నవారు ఆవు మూత్రంతో ముఖాన్ని శుభ్రం చేసుకున్నట్లు అయితే కొద్ది రోజులకే తగ్గిపోతాయట.. ఇవే కాకుండా గజ్జి తామర వంటి చర్మ వ్యాధులను సైతం నయం చేయడానికి ఈ గోమూత్రాన్ని సైతం ఉపయోగిస్తారని నిపుణులు తెలియజేస్తున్నారు. ఆవు తాజా మూత్రంలో దాదాపుగా 14 రకాల బ్యాక్టీరియాలు సైతం ఉంటాయని తెలియజేస్తున్నారు.. ఏది ఏమైనా ఆవు గోమూత్రం తాగడం మంచిదే నట..

మరింత సమాచారం తెలుసుకోండి: