సాధారణంగా కొంతమందికి అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయి.కాని మరి కొంతమందికి వారు అనుకున్న పనులు అస్సలు జరగవు అని దిగులు పడుతూ ఉంటారు.అంతేకాక వారు ఆర్థిక సమస్యలు,ఉద్యోగ సమస్యలు,వివాహ సమస్యలు ఒక్కటేమిటి పళ్ళు రకాల సమస్యలతో బాధపడుతున్నప్పుడు వారికి ఏమైన గ్రహదోషాలు ఉన్నాయేమో అని జ్యోతిష శాస్త్రం నిపుణులను కలుస్తూ,కొన్ని నివారణ పాటిస్తూ డబ్బులు ఖర్చు చేసుకుంటూ ఉంటారు.కానీ అలాంటివి ఏమీ అవసరం లేదని ఆదివారం పూట సూర్య భగవాన్ ని కొలుస్తూ, పదార్థాలను దానం చేయడం వల్ల,వారికి ఎటువంటి గ్రహదోషాలు ఉన్నా కూడా తొందరగా తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు.అసలు ఆదివారం పూట దానం చేయాల్సిన పనులు పదార్థాలు ఏంటో,వాటి వల్ల కలిగే ఉపశమనాలేంటో తెలుసుకుందాం పదండి..


గ్రహాలు అన్నిటికి రారాజు సూర్య భగవానుడని మనకు తెలుసు కదా.సూర్యుడికి ఎంతో ఇష్టమైన రాగి వస్తువులను కానీ, రాగితో తయారు చేసిన ఆభరణాలను కానీ దానం చేయడం వల్ల సూర్య భగవానుని అనుగ్రహం కలిగి,ఉద్యోగ సమస్యలు తొందరగా తొలగిపోయి,త్వరలో ఉద్యోగాలు పొందుతారని చెబుతున్నారు.

బెల్లం..

జ్యోతిషశాస్త్రం అనుసరించి ఆదివారం పూట బెల్లం దానం ఇవ్వాలి.ఇలా చేయడం వల్ల మీరు సూర్యభగవానుడిని ప్రసన్నం చేసుకున్నవారవుతారు. మరియు సూర్య దేవుని అనుగ్రహం మీపై కలుగుతుంది. బెల్లం దానం చేయడం వల్ల మీ జీవితంలోని ఎలాంటి కష్టాలు వున్నా తొలగిపోతాయి.మరియు ఆయన ఆశీస్సులతో మీ జీవితం సుఖసంతోషాలు కలుగుతాయి.

మినుములు..

ఆదివారం సూర్య భగవానున్ని ఆరాధించి మినుములు దానం చేయడం వల్ల,కుజ దోషాలు తొలగి పెళ్లిళ్లు తొందరగా అవుతాయి.మరియు ఇలాంటి వారు 9 వారాల పాటు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసినా కూడా మంచి ఫలితం దక్కుతుంది.

 ఎరుపు వస్త్రాలు..

కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగా లేనివారు మరియు వ్యాపారంలో నష్టాలు చవిచూసేవారు సూర్య భగవానుని ఆరాధించుకుంటూ ఆదివారం పూట ఎరుపు వస్త్రాలను దానం చేయడం వల్ల వారి సమస్యలు తొందరగా తొలగిపోతాయి.

మరి ముఖ్యంగా వీటన్నిటిని దానం తీసుకునే వారికి తోచినంత ధనం కూడా ఇవ్వాలని వేద పండితులు చెబుతున్నారు.దీనివల్ల దానం తీసుకున్న వారి పుణ్యం మీకు వచ్చి,మీ పాపం వారికి కొంచెం వెళ్తుంది.కనుక వారికి నివారణ చేసుకోవడానికి ఆ ధనం ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: