
మంగళవారం లక్ష్మి దేవికి ఇష్టమైన రోజుల్లో ఒకటిగా చెప్పవచ్చు.అటువంటి మంగళవారం పూట లక్ష్మీదేవిని ఆరాధించి, ఎర్రటి పూలను సమర్పించాలి.ఇప్పుడు ఏవైనా రెండు పది రూపాయల నోట్లు కానీ,20 రూపాయల నోట్లో కానీ తీసుకొని దానికి పసుపు, కుంకుమ రాయాలి.మరియు సేంట్ కూడా కొట్టాలి.ఈ నోట్ లను లక్ష్మీదేవి ఎదురుగా ఉంచి,రెండు లేదా మూడు దాల్చిన చెక్కలను కూడా పూజలో ఉంచాలి. ఇలా మంగళవారం ఆ నోట్లను మరియు దాల్చిన చెక్కను బుధవారం పూట తీసి,పది రూపాయలు నోట్లు మరియు దాల్చిన చెక్కలను ఒక దారంతో కట్టాలి.
ఇలా కట్టిన వాటిని వ్యాపార స్థలంలో కానీ,జేబులో కానీ, పర్సులో కానీ,డబ్బును ఉంచె బీరువాలో కానీ ఉంచుకోవాలి.ఇలా ఉంచడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధన ప్రవాహాన్ని కలిగిస్తుంది.దీనితో ఎటువంటి మొండి బాకీలైనా కూడా వెంటనే తిరిగి వస్తాయి.అంతేకాక ఆర్థిక సమస్యలతో బాధపడేవారు కూడా ఈ చిట్కాను పాటించడం వల్ల ధనాకర్షణ కలిగి, వారి సమస్యలు తొందరగా తొలగిపోతాయి.కావున మీరు కూడా ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే,వెంటనే ఈ రెమిడి పాటించి చూడండి