దేశవ్యాప్తంగా హిందువులందరూ కూడా ఎంతో నిష్టతో కొలిచే దేవుడు అయ్యప్ప. ఏకంగా గుడికి వెళ్లి ఏదో పూజ చేసి రావడం కాదు. ఏకంగా అయ్యప్ప మాల ధరించి దాదాపు 40 రోజులపాటు ఎంతో నిష్టగా పూజలు చేస్తూ ఉంటారు. ఇక పాదాలకు కనీసం చెప్పులు కూడా వేసుకోకుండా.. అత్యంత పవిత్రంగా అయ్యప్ప మాలధారణలో కొనసాగుతూ ఉంటారు స్వాములు. ఇక 40 రోజుల దీక్ష పూర్తయిన తర్వాత శబరి చేరుకుని  అయ్యప్ప స్వామిని దర్శించుకుని ఇక దీక్షను విరమించడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇలా అయ్యప్ప మాలధారణ చేసిన స్వాములు అందరూ కూడా ఇక ప్రతి ఏటా ఒకసారి అయ్యప్ప దర్శనాన్ని చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. కొంతమంది ఒకటి లేదా రెండుసార్లు అయ్యప్ప స్వామిని దర్శించుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ కేరళకు చెందిన పదేళ్ల బాలిక మాత్రం ఇప్పటివరకు ఏకంగా 50 సార్లు అయ్యప్ప దర్శనం చేసుకుంది. అదేంటి మాల వేసినప్పుడు ప్రతి ఏట ఒక్కసారె కదా అయ్యప్ప స్వామి దర్శనం చేసుకునేది. ఆ బాలిక పదేళ్ల వయసులోనే 50 సార్లు ఎలా దర్శించుకుంది అంటారా..


 కేరళకు చెందిన అభిలాష్ మనీ కుమార్తె అతిథి తన 9 నెలల ప్రాయం నుంచి తండ్రీతో పాటు తొలిసారిగా అయ్యప్ప స్వామిని దర్శించుకుంది. ఇక ఆపై మానస పూజ, మండల పూజ, మకర జ్యోతి సమయంలో శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నట్లు సమాచారం. ఇలా ఏడాదికి మూడుసార్లు చొప్పున ఆ బాలిక పదేళ్ల వయసులో ఏకంగా 50వ సారి అయ్యప్ప స్వామిని దర్శించుకోనున్నట్లు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఆ బాలిక నాలుగో తరగతి చదువుతుంది. తండ్రితో పాటు 50 వ సారి ఇరుముడి కట్టి శబరిమలకు వెళ్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. ఈ ఫొటో ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: