ఈ క్రమంలోనే ఉన్న బాల రాముడిని దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ కూడా అయోధ్యకు తరలి వెళ్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఈ అయోధ్య రామ మందిరం గురించి చర్చ జరుగుతుంది. అయితే కొంతమందిలో అయోధ్య రామ మందిరం గురించి ఒక కన్ఫ్యూషన్ అలాగే ఉండిపోయింది. ఎందుకంటే శ్రీరాముడు అనగానే సీత సమేత లక్ష్మణ హనుమంతుడితో కలిసి కనిపిస్తూ ఉంటాడు. కానీ అయోధ్యలో కేవలం రాముడు విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్టించారు.
అయితే సీతారాముల విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదు అనే సందేహం చాలా మందిలో ఉంది. ఎందుకంటే ఇక మనకు తెలిసిన రామాయణంలో సీతా రాముడు లక్ష్మణుడు హనుమంతుడు పేర్లు కనిపిస్తూ ఉంటాయి. ఇక ఏ గుడిలో చూసిన వీరి విగ్రహాల దర్శనం ఇస్తాయ్. కానీ అయోధ్యలో మాత్రం కేవలం బాలరాముడు విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్టించారు. అయితే ఈ విషయంపై ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సముద్ర గుప్త, విక్రమాదిత్య కాలం ఒక వెయ్యి 1076- 1126 సీఈకి ముందు నుంచి అయోధ్యలో రామాలయం ఉంది. అప్పుడే రాములల్లా ఐదు నుంచి 6 అడుగుల మూర్తి బాలరాములు ఉండేవాడు. అందుకే రామ జన్మభూమిలో కేవలం రాముడు విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్టించారు అంటూ చెప్పుకొచ్చాడు చాగంటి కోటేశ్వరరావు.