ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా మొహర్రం వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే మొహరం పండుగ వచ్చినప్పుడల్లా కేవలం ముస్లిం సోదరులు మాత్రమే కాదు హిందువులు కూడా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. చాలా గ్రామాల్లో ఇక అన్ని పండగల కంటే ఎక్కువగా మొహర్రం వేడుకలు జరుపుకోవడం కూడా చూస్తూ ఉంటాము అన్న విషయం తెలిసిందే. ఇక హిందూ ముస్లిం అనే తేడా లేకుండా కులమతాలకు అతీతంగా ఈ వేడుకను జరుపుకోవడం చూస్తూ ఉంటాం.


 ఇక ముస్లిం సోదరులు అయితే మొహర్రం వేడుకను మరింత శ్రద్ధ శక్తితో జరుపుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అయితే అసలు ఈ మొహర్రం వేడుకను ఎందుకు జరుపుకుంటారు? జరుపుకోవడానికి గల కారణం ఏంటి.. ఇలా మొహర్రం వేడుకను జరుపుకునే సమయంలో పీర్లను మొక్కడం చేస్తూ ఉంటారు. అసలు ఈ పీర్లను మొక్కే అలవాటు ఎప్పటి నుంచి వస్తుంది అన్న విషయం కూడా చాలామందికి తెలియదు. అయితే అమరవీరుల జ్ఞాపకార్థమై ఈ మొహర్రం వేడుకను ప్రతి ఏటాజరుపుకుంటారు అన్న విషయం తెలుస్తోంది. అయితే కర్బలా యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త మనవడు ఇమామ్ హుస్సేన్ తో పాటు ఆయన అనుచరులు వీరమరణం పొందారట.


 ఈ క్రమంలోనే అప్పటినుంచి ఈ మొహర్రం వేడుకను జరుపుకోవడం మొదలుపెట్టారట. ఇలా యుద్ధంలో వీరమరణం పొందిన ఇమామ్ హుస్సేన్ తో పాటు అతని అనుచరుల మరణాన్ని గుర్తు చేసుకుంటూ మొహర్రం జరుపుకుంటూ ఉంటారట. అయితే ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొదటి మాసం మొహరం జరుపుకుంటారు అని చెప్పాలి. ఇక ఇలా అమరవీరులను స్మరిస్తూ ఊర్లలో పీర్లను ప్రతిష్టించి ఊరేగించడం లాంటివి చేస్తూ ఉంటారు. అదే సమయంలో మొహర్రం మాసంలో అటు ముస్లిం సోదరులందరూ కూడా అటు ఆడంబరాలకు దూరంగా ఉంటారు అని చెప్పాలి. ఈ నెలలో ఎక్కువగా మతపరమైన కార్యక్రమాలను అస్సలు నిర్వహించరట. ఎందుకంటే ఈ మాసం మొత్తాన్ని కూడా సంతాప దినాలుగా ముస్లింలు భావిస్తూ ఉంటారట.

మరింత సమాచారం తెలుసుకోండి: