మన ఇండియాలో ఎన్నో ప్రసిద్ధమైన దేవాలయాలు ఉన్నాయి.. ఇండియాలో ఉండేటువంటి దేవాలయాలను చూడడానికి చాలా మంది ఇతర దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు.. అయితే మన ఇండియాలో అత్యంత ధనిక దేవాలయం ఏది అనే విషయానికి వస్తే.. ఎక్కువమంది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం అని చెబుతూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో ఈ గుడి ఉన్నది. పదహారు ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఈ గుడి పదవ శతాబ్దంలో నిర్మించారట. ప్రతి సంవత్సరం ఈ దేవాలయం యొక్క ఆదాయం 1500 నుంచి 2000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు నిపుణులు. ప్రపంచంలో అత్యధిక సంపన్న కలిగిన దేవాలయాలలో తిరుపతి కూడా ఒకటి.


మరొక గుడి పూరి జగన్నాధ ఆలయం.. ఒడిస్సా లో ఈ ఆలయం కలదు. దేవాలయానికి వచ్చే ఆదాయంతో పాటు ఈ మధ్యనే ఈ గుడి లోపల ఉండేటువంటి రహస్య గదుల ద్వారా చాలా సంపద బయటపడిందట. ఈ గుడి 11వ శతాబ్దంలో నిర్మించారు. ఈ దేవాలయానికి వందల కోట్ల ఆస్తి ఉండడమే కాకుండా 30 వేల ఎకరాల భూమి కూడా ఉన్నట్లు సమాచారం.


మరొక ప్రసిద్ధి చెందిన ఆలయాలలో కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం.. తిరు అనంతపురం దగ్గరలో ఉండే ఈ ఆలయం సుమారుగా 120,00 కోట్ల రూపాయల ఆస్తి కలగట. ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంగా నిలిచింది. ఈ దేవాలయం దగ్గర బంగారు విగ్రహాలు వెండి, మచ్చలు పురాతన వస్తువులు, వజ్రాలు వంటివి ఉన్నాయట. అయితే ఇందులో కొంతవరకు బయటకి తీసిన ఇంకా కొన్ని గదులు మాత్రం తీయలేదు. ఆ గదులకు నాగబంధం ఉందనే విధంగా తెలుస్తోంది అందుకే ఆ తలుపు తీయడానికి భయపడుతున్నారు.


మరొక దేవాలయం గోల్డెన్ టెంపుల్ పంజాబ్ లోని అమృతసర్ పట్టణంలో కలదు. 400 కిలోల బంగారంతో ఈ దేవాలయానికి పూత చేయించారట. అందుకే దీనిని గోల్డెన్ టెంపుల్ అని పిలుస్తూ ఉంటారు. ఈ గుడి ఏడాది ఆదాయం 500 కోట్లకు పైగా ఉంటుంది.1581 నిర్మించడం మొదలుపెట్టి 8 ఏళ్లకు పూర్తి చేసుకున్నట్లు సమాచారం.


మరొక దేవాలయం శిరిడి బాబా.. మహారాష్ట్రలో కలదు. 1922లో నిర్మించారు. సింహాసనం దాదాపుగా 100 కిలోల బంగారంతో చేయించారట. అలాగే 400 కోట్ల విరాళాలు నగదు బంగారు ఉన్నట్లు తెలుస్తోంది. ఏడాదికి 500 కోట్లకు పైగా ఆదాయం ఉంటుందని అంచనా.


ఇక ఇవే కాకుండా గుజరాత్లో సోమనాథ్ ఆలయం.. వైష్ణో దేవి ఆలయం, ముంబైలో ఉండే సిద్ధి వినాయక దేవాలయం వంటివి కూడా భారీగాన్ని ఆదాయాన్ని కలిగి ఉన్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: