1). తాడిపత్రి: శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి:
ఈ ఆలయం తాడిపత్రిలోని పెన్నా నది ఒడ్డున కలదు. ఇది చాలా పురాతనమైన ఆలయం ఇందులో శివుడు రామలింగేశ్వర స్వామి ఒకేసారి కొలువై ఉన్నారు..
2) కూడేరు :జోడి లింగాల క్షేత్రం:
ఎక్కడా లేనివిధంగా ఓకే గుడిలో రెండు జోడి లింగాలు ఉన్నవి.. ఈ లింగాలను దర్శించుకుంటే కోటిలింగాలు దర్శించుకున్నట్లుగా భక్తులు భావిస్తూ ఉంటారు. ఈ లింగాలు 182 అడుగుల నుంచి ఉద్భవించినవని చెబుతూ ఉంటారు.
3). పామిడి: భోగేశ్వర స్వామి దేవాలయం:
పెన్నా నది ఒడ్డున ఈ దేవా ఆలయం కలదు.. శివుడునే భోగేశ్వరుడు గా ఎక్కడ పిలుస్తూ ఉంటారు. ఈ దేవాలయం లో కార్తీకమాసంలో లక్షదీపాదన కార్యక్రమం అక్కడి ప్రజలు చేపడుతూ ఉంటారు.
4). లేపాక్షి: వీరభద్ర స్వామి దేవాలయం:
ఈ దేవాలయాన్ని 16వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయంలో కొలువై ఉన్న వీరభద్ర స్వామి తో పాటు ఇందులో రాముడు కృష్ణుడు పురాణ గాధలకు సంబంధించినవిగా పండితులు తెలుపుతున్నారు. అలాగే ఏక రాతితో చెక్కబడిన నంది విగ్రహం కూడా కలదు. ఈ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాలలో కూడా ఒకటి.
5). గార్లదిన్నే: కోటంక శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి:
ప్రతి ఆదివారం వందలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఈ ఆలయాన్ని హిందువులు తప్పకుండా దర్శించాల్సిన ప్రదేశాలలో ఒకటి.
6). తాడిమర్రి: చిల్లవారి పల్లి శ్రీ కాటి కోటేశ్వర స్వామి:
ఈ ఆలయంలోకి వచ్చేటప్పుడు ఆలయం బయట ఉన్న కోనేటిలోని స్నానం చేసిన తర్వాతే.. ఈ ఆలయానికి సంబంధించి వందల ఏళ్ల చరిత్ర ఉన్నది. కాకి, గ్రద్ద కూడా ఇక్కడ వాలేదట. అయితే అక్కడ ఏదైనా తప్పు చేస్తే తేనెటీగలు దాడి చేస్తాయట.
7) బుక్కరాయసముద్రం: శ్రీ కాశీ విశ్వనాధ క్షేత్రం:
ఈ దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం ఇక్కడ శివుడు విగ్రహం కలదు ఎంతోమంది భక్తులు భక్తిశ్రద్ధలతో శివుడిని పూజిస్తూ ఉంటారు.
ఇక ఇవే కాకుండా బత్తలపల్లిలో శ్రీ కాటి కోటేశ్వర స్వామి క్షేత్రం, అలాగే విడవనకల్లులో భీమ లింగేశ్వర స్వామి క్షేత్రం, కంబదూరులో మల్లేశ్వర స్వామి దేవాలయం, అమరాపురంలో సిద్దేశ్వర స్వామి ఆలయం కలదు. ఇవన్నీ కూడా కార్తీక మాసంలో దర్శించడం వల్ల మంచి కలుగుతుంది.