ఇకపోతే దీపావళి రోజున పెరుగుతో లక్ష్మీదేవిని పూజించాలని పండితులు చెబుతున్నారు . ఎందుకంటే పెరుగులో లక్ష్మీదేవి ఉంటుందని, ఈ పర్వదినాన పెరుగును ఉపయోగించి కొన్ని పనులు చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి సంతోషించి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేస్తుందని పండితులు చెబుతున్నారు.
దీపావళి రోజున ఒంటికి నువ్వుల నూనె రాసుకుని, అభ్యంగన స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని చెబుతున్నారు. ఇకపోతే ఈ రోజున స్నానం చేసే ముందు ఈ పరిహారం చేయాలి. స్నానం చేసే నీళ్లలో రెండు స్పూన్ల పెరుగు కలిపి ఐదు నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. దీపావళి వేళ పెరుగును ఉపయోగించి స్నానం చేస్తే ఆర్థిక సమస్యలు పోయి రావాల్సిన బకాయిలన్నీ తిరిగి పొందుతారు. అందుకే స్నానం చేసే ముందు నీళ్లలో పెరుగు వేసుకొని స్నానం చేయాలి. పెరుగుతో పాటు రెండు మూడు మామిడి ఆకులు వేసుకొని స్నానం చేసినా సరే ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.. ఏది ఏమైనా మహా లక్ష్మి కటాక్షం పొందాలి అంటే దీపావళి రోజున ఈ చిన్న పరిహారం పాటించండి..