భక్తులందరూ కూడా తమ దగ్గరలో ఉన్న శివాలయాలకు భారులు తీరి అక్కడ పూజలు చేస్తూ ఉన్నారు. ఏకంగా కార్తీక దీపాలు వెలిగిస్తూ ఆ మహా శివుడిని కొలుచుకుంటూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఏ శివాలయానికి వెళ్ళిన శివలింగం దర్శనమిస్తూ ఉంటుంది. అయితే ఇలా గుడిలో ఉండే శివలింగం ఏదో ఒక కలర్ లో మాత్రమే ఉంటుంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునే శివలింగం మాత్రం ఏకంగా సైన్స్ కి అందని రహస్యాన్ని కలిగి ఉంది. ప్రతిరోజు ఆ శివలింగం రంగులు మారుతూ ఉంటుంది. ఇక ఈ విషయం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
తమిళనాడు రాష్ట్రం అతి పురాతనమైన ఆలయాలకు నిలయంగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ సైన్స్ కు చిక్కని ఎన్నో రహస్యాలు సంపదలు ఉన్నాయ్. ఆలయాలు కూడా ఉన్నాయి ఇందులో తిరునల్లూరులో ఉండే శ్రీ పంచ పరమేశ్వరాలయం కూడా ఒకటి. ఈ గుడిలో ఉన్న శివలింగం ఒక్క రోజులోనే ఐదు రకాల రంగుల్లో మారుతూ ఉంటుంది. లింగాన్ని రాగి, పింక్, గోల్డెన్, ఆకుపచ్చ, అనౌన్ కలర్లో చూడవచ్చు. చోళ రాజులు నిర్మించిన ఈ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే అటు కైలాసగిరి ప్రదక్షిణ చేసినట్టే అని భక్తులు ప్రకారంగా విశ్వసిస్తూ ఉంటారు. అయితే ఇలా శివలింగం ఎలా రంగులు మారుతుందని సైంటిస్టులు ఎన్నోసార్లు పరిశోధనలు చేసిన ఎలాంటి రహస్యం బయటపడలేదు.