ఈ సమయంలోనే కుటుంబంతో కలిసి సూర్య భగవానుడిని, అగ్ని దేవుడు ,శ్రీకృష్ణ భగవానుని, దుర్గాదేవిని పూజించడం వల్ల చాలా లాభాలు ఉంటాయట. అయితే భోగి పండుగ రోజున ఎవరు కూడా ఇలాంటి పొరపాట్లు చేయవద్దని పలువురు పండితులు వెల్లడిస్తున్నారు వాటి గురించి చూద్దాం.
భోగి మంటలు వేసేటప్పుడు చెత్త లేదా ఏదైనా ప్లాస్టిక్ వంటివి ఉపయోగించవద్దు.. ఇది అగ్నిని అపవిత్రంగా భావిస్తారు. భోగి మంటలు వేసేటప్పుడు ఇలాంటివి లేకుండా చూసుకోవాలి.
భోగిమంటను ఎప్పుడూ కూడా కర్పూరం వంటి వాటితోనే వెలిగించాలి. లేకపోతే నెయ్యితోనైనా వెలిగించడం మంచిదట.
భోగి మంటలలో పాత చెప్పులు వేయకూడదు.. అలాగే భోగి మంటల చుట్టూ తిరగాలనుకునే వారు చెప్పులు లేకుండా ప్రదర్శన చేయాలి.
భోగిమంటలలోకి వేసే ప్రసాదం ఎంగిలి చేసిన ప్రసాదంగా ఉండకూడదు.
భోగి మంటల దగ్గర ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు.. వారి యొక్క మనసును కూడా నొప్పించకూడదట.ఇలా చేస్తే దేవతలకు కోపం వస్తుందట.
భోగి రోజున ఎలాంటి పనులు చేయాలి అంటే:
నువ్వులు, బెల్లం ,వేరుశెనగను అగ్గిలోకి వేయడం వల్ల ఆ ఇంటిల్లిపాది ఉండే దరిద్రం పోయి అష్ట ఐశ్వర్యాలు అందుకుంటారు.
భోగి రోజున పేదలకు దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందట.
భోగి పండుగను ఇండియన్ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగము.. ముఖ్యంగా వ్యవసాయానికి ప్రాధాన్యత గుర్తు చేస్తుందట. అందుకే ఈ పండుగలకు కొన్ని ప్రాంతాలలో చాలా గ్రాండ్ గా జరుపుకుంటూ ఉంటారు.