తెలుగు వారు జరుపుకునే అత్యంత పెద్ద పండుగలలో సంక్రాంతి గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి.. వరుసగా మూడు రోజులు జరిగే ఈ పండుగ అంటే చాలా మందికి ఎంతో స్పెషల్..ముఖ్యంగా మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగలో మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ అని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు..మొదటి పండుగ భోగి సమయానికి రేగుపళ్లు అందుబాటులోకి వస్తాయి. పుల్లపుల్లగా ఉండే ఈ రేగు పళ్లు తినడానికి ఎంతో రుచిగా ఉండటమే కాదు, సకల ఆరోగ్యాలనూ అందించే ఔషధి గుణాలతో నిండి ఉంటాయి. మన దేశంలోనే కాకుండా తూర్పు దేశాలన్నింటిలో ఈ రేగు పండ్లని తమ సంప్రదాయ వైద్యం లో వాడతారు. జలుబు దగ్గర నుంచీ సంతాన లేమి వరకూ వంటి అన్నిరకాల రుగ్మతలకీ దివ్యౌషధంగా ఈ రేగు పండ్లను ఉపయోగిస్తారు..రేగుపళ్లు ఉన్నచోట క్రిమి కీటకాలు దగ్గరికి చేరవని అందరి నమ్మకం.

భోగి పండుగ రోజున దిష్టి తీసిన పళ్లను తినకూడదన్న నిబంధన ఉంది..కానీ పిల్లలు తినేందుకు కావల్సినన్ని రేగుపళ్లు ఈ రోజు అందుబాటు లో ఉంటాయి. ఈ భోగి పళ్లను ఐదేళ్లలోపు పిల్లలకి పోస్తారు. ఈ వయసులో ఉన్న పిల్లల్లో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది.  రేగుపళ్లు నిజంగా వీరిపాలిట అమృతంలా పనిచేస్తాయి. ఎందుకంటే రేగుపళ్లలో  ‘సి’ విటమిన్‌ చాలా ఎక్కువగా ఉండి రోగనిరోధకశక్తిని పెంచుతుంది. పైగా జీర్ణ సంబంధమైన వ్యాధులను నివారించేందుకు, ఉదరసంబంధ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించేందుకు రేగుపళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి.ఇక రేగుపళ్లతో పాటు బంతిపూల రెక్కలని వాడటం వల్ల కూడా పిల్లల చుట్టుపక్కల ఉండే క్రిములన్నీ దరికి చేరవు.. దీనితో భోగి పళ్ళు చిన్నపిల్లల పాలిట వరంగా మారాయని చెప్పొచ్చు..భోగితో సకల భోగభాగ్యలు తమ ఇంటికి చేరాలని ప్రతీ ఇంటిలోనూ పొంగలి పెట్టి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు

మరింత సమాచారం తెలుసుకోండి: