భారతీయులంటేనే  సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు.. భారత్ లో ఎంతోమంది మతస్తులు ఉంటారు. కానీ ఎక్కువమంది హిందువులే ఉండడం విశేషం.. అందుకే భారతదేశాన్ని భిన్న సంస్కృతులకు పుట్టినిల్లు అని పిలుస్తూ ఉంటారు. అలాంటి భారతదేశంలో మహా కుంభమేళలో స్నానాలు చేయడం అంటే  చాలామంది హిందువులు పుణ్యంగా  భావిస్తారు.. ముఖ్యంగా ప్రయాగ్ రాజ్ లో జరిగే ఈ మహా కుంభమేళకు  రోజుకు కోట్లాదిమంది భక్తులు వస్తున్నారు.. అయితే ఈ కుంభమేళా అనేది 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.. ముఖ్యంగా సరస్వతీ, యమునా, గంగా, నదులు కలిసే త్రివేణి సంఘమంలో భక్తులు పవిత్ర స్నానాలు చేసి కోరికలు కోరుకుంటారు. అలాంటి ఈ మహా కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అని చెప్పవచ్చు.. 

అలాంటి కుంభమేళ చరిత్ర గురించి మన తెలుగు రాష్ట్రాల్లో మీడియా ఛానల్స్ పెద్దగా చూపించకపోయినా కానీ చాలా మంది ప్రజలు ఈ మహా కుంభమేళకు వెళ్తున్నారు. ఇప్పటివరకు ఈ కుంభమేళాకు ఎంతమంది వెళ్లారు వివరాలు ఏంటో చూద్దాం.. ఈ కుంభమేళకు సంబంధించి చాలా మంది తెలుగు పత్రికల్లో టీవీ ఛానల్స్ లో అక్కడ ఏదైనా తగలబడితే, లేదా తొక్కిసలాట జరిగితే చూపిస్తారు. అంతేకాకుండా అక్కడ పూసల అమ్ముకునే వారిని మరింత హైలెట్ చేశారు.. కానీ అక్కడ స్నానాల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? మహా కుంభమేళా విశిష్టత ఏంటి? అనేది ఎవరు కూడా చూపించడం లేదు.. 

ఇలా టీవీల్లో రాకున్నా, పేపర్లలో చూపించకపోయినా, అక్కడ ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని నెగిటివ్ వార్తలు రాసిన కానీ హిందూ ప్రజలు ఎక్కడ కూడా ఆగిపోలేదు.. తప్పకుండా త్రివేణి సంగమం వెళ్లి మహాకుంభమేళలో పుణ్యస్నానాలు ఆచరించారు.. ఇప్పటివరకు దాదాపుగా 40 కోట్లకు పైగానే ఈ కుంభమేళకు చేరుకున్నారని, మరికొన్ని రోజుల్లో ఇంకా  కోట్లాది మంది ప్రజలు త్వరలో దర్శించుకోబోతున్నారు.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా హిందూ ప్రజలు మాత్రం అక్కడికి వెళ్లడం మానడం లేదు.. దీన్ని బట్టి చూస్తే కుంభమేళలో పుణ్యా స్నానాలు ఆచరిస్తే ఎంతటి  పుణ్యం కలుగుతుందో చెప్పకనే చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: