
మహాశివరాత్రి పర్వదినానికి ఓ ప్రత్యేకత ఉంది .. ఇక హిందూ పురాణాల ప్రకారం శివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం జరిగినట్టు నమ్ముతారు .. అలాగే అదే రోజున లింగోద్భవనం జరిగిందని కూడా చెప్తారు .. ఇక పరమ శివుడిని పురుషుడిలా చూస్తే , పార్వతి దేవిని ప్రకృతిగా సూచిస్తుంది .. ఈ సృష్టికి మూలమైన శక్తి చైతన్యల కలయికను మహాశివరాత్రి పర్వదినం గా సూచిస్తుంది .
ఇక అలాగే ఈ పర్వదినం రోజున ఎవరు భక్తతో శివుడిని ప్రార్థిస్తారో , ఉపవాస జాగరణ దీక్షకులు చేస్తారో వారందరికీ శుభాలు కలుగుతాయని శివుని కటాక్షం వారిపై ఉంటుందని చెబుతారు .. ఇక ఈ పవిత్రమైన రోజున శివుని మనసులో లగ్నం చేసుకుని శివయ్యను ఆరాధిస్తూ ఉపవాస దీక్షను ఆచరిస్తారు .. వారిపై శివుడి అనుగ్రహం కలుగుతుందని పురాణాలు కూడా చెబుతున్నాయి .. జాగరణ తో కూడా మనుషులు చేసిన సకల పాపాలు తొలగిపోతాయి .. అలాగే వారికి మోక్షం కలుగుతుందని అంటారు .. ఇక శివుడి కి అభిషేకాలు అంటే ఇష్టం .. శివ శివరాత్రి రోజు న కూడా భక్తులు శివుడి కి ప్రత్యేక అభిషేకాలు చేస్తారు .