భారతదేశంలో నదులు చాలా ఉన్నాయి. ఒక్కో నదికి ఒక్క పేరు ఉంటుంది .. దాదాపు అన్ని నదులకు స్త్రీల పేరులే ఉంటాయి. ఆ నదులను తల్లిగా కూడా భావిస్తారు. మన దేశంలో స్త్రీలకు ఇచ్చే ప్రాముఖ్యత ఎలా ఉంటుందో ? ఆ ప్రత్యేకత తెలిసిందే. అందుకే దాదాపు మన దేశం లో నదులు అన్నింటి పేర్లకు స్త్రీ ల‌ పేర్లే ఉంటాయి. కానీ మన దేశంలో ప్రవహించే ఒకే ఒక్క నదికి మాత్రం పురుషుడి పేరు ఉంది. ఆ నది ఏదో ?తెలుసుకుందామా .. గంగా - యమునా - నర్మదా - గోదావరి వంటి నదులను కూడా స్త్రీలుగా పరిగణిస్తారు. అందుకే ఈ నదులను తల్లులు అని పిలుస్తారు. ఉదాహరణకు గంగామాత .. తల్లి గంగా అని పిలుస్తారు. హిందూ ధర్మంలో ఈ నదుల గురించి చాలా గొప్ప నమ్మకం ఉంది. నదులను దేవుడితో సమానంగా పూజిస్తారు. నదుల్లో స్నానం చేస్తే పాపాలు పోతాయి అని కూడా చెబుతారు.


 కానీ ఈ నదులను అడవిగా పూజించే ఈ దేశంలో కూడా ఒక ఆశ్చర్యం ఉంది. భారతదేశంలో తండ్రిగా పరిగణించే ఒక నది ఉందని మీకు తెలుసా ? ఆ నది మరేదో కాదు .. బ్రహ్మపుత్ర భారతదేశంలో ఏకైక పురుష నది అని దీనిని పిలుస్తారు. ఎందుకంటే బ్రహ్మదేవుడు కొడుకు అని నమ్మకం. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మపుత్ర నదిని బ్రహ్మదేవుడు కొడుకుగా ప‌రిగ‌ణిస్తారు. అందుకే దీనిని పురుష నది అంటారు .. మిగిలిన నదులను అడవిగా పూజిస్తే ఈ నదికి మగస్థానం ఇస్తారు. హిమాల‌యా ల లోని మంచు పర్వతాలలో పుట్టే ఈ నదిని పవిత్ర న‌ది అని కూడా పూజిస్తారు. ఈ బ్రహ్మపుత్ర నది పొడవు సుమారు 2900 కిలోమీటర్లు.. ఇది టిబిట్ లోని మానససరోవరం దగ్గర మొదలయ్యి అక్కడ నుంచి ప్రవహిస్తూ వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: