( కృష్ణా - ఇండియా హెరాల్డ్ ) . . .

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ భలే రామస్వామి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 26వ తేదీన ముసునూరు మండలం బలివేలో వేంచేస్తున్న శ్రీ రామలింగేశ్వర స్వామి మహా శివరాత్రి ఉత్సవాలకు  అధికారులు ఏర్పాట్లను సర్వం సిద్ధం చేశారు. ఈ బ‌లివే ఉమ్మ‌డి కృష్ణా జిల్లాకు.. ఇటు ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు క‌రెక్టుగా స‌రిహ‌ద్దులో ఉంటుది. అటు ముసునూరు మండ‌లంలో బ‌లివే ఆల‌యం.. త‌మ్మిలేరు న‌ది ఒడ్డున ఉంటుంది. ఇటు పెద‌వేగి మండ‌లం విజ‌య‌రాయి ప‌రిధిని ఆనుకుని ఉంటుంది.


ఇక ఈ ఏడాది బలివే తమ్మిలేరులో భక్తుల స్నానాలకు నూతనంగా ఏర్పాటు చేసిన ఘాట్లు ఈ మహాశివరాత్రికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఘాట్లు నిర్మాణం చేయటం వల్ల స్నానాలకు ఉన్న ఇబ్బందులు తొలగిపోయినట్లు అయ్యాయి. మొత్తం మూడు ఘాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. అంతేకాక జల్లుల స్నానాలు కూడా ప్రత్యేకించి భక్తులు సౌకర్యార్థమే ఏర్పాటు చేసినట్లు ఎండోమెంట్ శాఖ అధికారులు తెలిపారు. ఏలూరు జిల్లా కలెక్టర్ సెల్వి భ‌లే రామస్వామి ఉత్సవాలను ప్రత్యేకించి స్వయంగా పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఏలూరు ఎస్పీ శివ కిషోర్ కూడా ఏర్పాట్లను పరిశీలించి పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.


చాట్రాయి మండలం పోలవరం ప్రాజెక్టు నుండి విడుదల చేసిన నీరు ఇప్పటికే బలివే తమ్మిలేరును తాకాయి. ఈనెల 23వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఈ మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఎండోమెంట్ శాఖ అధికారి పామర్తి సీతారామయ్య తెలిపారు. ప్రతిరోజు స్వామి వారికి బిందుతీర్థం,బలిహరణాలు, లాంటి పూజా కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పరిష్కరించుకొని స్వామివారికి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.


బ‌లివేలో తమ్మిలేరుపై నూతనంగా నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దీంతో ఈ మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ప్రయాణం ఇక్కట్లు తొలగిపోయాయి. విజయరాయి నుంచి భలే రామస్వామి ఆలయం వరకు నూతనంగా తారు రోడ్డు నిర్మాణ పనులు ఈ ఉత్సవాలకు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: