
వీరభద్రుడు ప్రళయతాండవం చేసిన నేల పవిత్ర పట్టిసాచల క్షేత్రం. మహా శివరాత్రి రోజున వేలాది భక్తచన సందోహం భక్తి శ్రద్దలతో పరమశివుడి రూపమైన వీరేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. క్షేత్ర పవిత్రతని గోచరించే శైవ క్షేత్రాలలో పట్టిసాచల క్షేత్రం ఒకటి. శ్రీశైలం, కాశీ, కేదారం, కాళహస్తి, పట్టసం పంచక్షేత్రాలు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రసిద్ది చెందిన శైవ క్షేత్రాలలో అరుదైన శివక్షేత్రం పట్టిసీమ వీరేశ్వర స్వామి ఆలయం ఒకటి. పోలవరం మండలం, పట్టిసీమ గ్రామ సమీపాన గోదావరి నది మధ్యలో కొండపై వెలసిన పుణ్యక్షేత్రం. ఇటు ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి అందాల మేళవింపుతో నిత్యం భక్తులతో సందడి చేస్తున్న దివ్య క్షేత్రం. ప్రతి సంవత్సరం కార్తీకమాసం మరియు శివరాత్రి పర్వదినాలలో వేలాదిమంది భక్తులు వచ్చి స్వామివారి నిదర్శించుకుంటారు. పట్టిసీమ రేవు నుండి సుమారు మూడు,నాలుగు కిలోమీటర్లు దూరంలో ఇసుక తిన్నెల మీద నడిచి గుడికి చేరుకుని కొండ మీద ఉన్న స్వామి వారిని చేరుకుంటారు.
భధ్రకాళీసమేత వీరేశ్వరస్వామి ఆలయ చరిత్ర: పూర్వకాలంలో పట్టిసీమ క్షేత్ర పర్వతాన్ని దేవకూట పర్వతం అని పిలవబడేది. ఈ పర్వతం పరమేశ్వరుని సందర్శించుకొనుటకు కైలాసం వెళ్ళినది.కైలాస పర్వతం,దేవకూట పర్వతాన్ని హేళన చేసింది. ఆ అవమానాన్ని తట్టుకోలేక వెనుదిరిగి వచ్చి,శివకేశవుల ఇద్దరు గురించి తపస్సు చేసింది.ఆ తపస్సు ప్రభావం చేత శివకేశవులు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నారు.ఆ సందర్భంగా తనకు జరిగిన అవమానాన్ని వ్యక్తపరచింది. కైలాస పర్వతం విడిచి పెట్టి నా పర్వతంపై ఉండమని కోరింది. అప్పుడు శివ కేశవులు ఇద్దరు కూడా నీ పర్వతం పై ఉంటామని వరం ఇచ్చి సమయం వచ్చు వరకు వేచి ఉంటామన్నారు.దక్షప్రజాపతిని సంహరించడానికి పరమేశ్వరుడు తన జఠాజూటం తెంచి వీరభద్రుని పుట్టించి, పట్టిసం అనే ఆయుధాన్ని చేతికిచ్చి,దక్షిణ యజ్ఞం నాశనం చేసి దక్షిణ ప్రజాపతి శిరస్సును ఖండించమని ఆజ్ఞాపించారు.వీరభద్రుడు ఉగ్రావేశంగా వెళ్లి దక్షిణ యజ్ఞం నాశనం చేసి దక్షిణ ప్రజాపతి శిరస్సు ఖండన చేసి పట్టిసం అనే ఆయుధంతో ఉగ్రవేశంగా దేవకుంట పర్వతం పైకి వచ్చి ప్రళయ ఉగ్రతాండం చేశాడు.
ఆయన ఉగ్ర ఆవేశాన్ని శాంతింప చేయటానికి అగస్త్య మహాముని వచ్చి తన రెండు చేతులతో ఆలింగాశం చేసుకుని వీరభద్రుని శాంతింప చేసి పరమేశ్వరుని ఆజ్ఞ మేరకు దక్ష సంహారం కోసం ఉద్భవించావు స్వామి నీ ఉగ్ర ఆవేశంను తగ్గించి దేవకూట పర్వటం యొక్క వరం కోరిక మేరకు స్వయంభువుగా వెలసి భక్తుల కోరికలు తీర్చమని ముని కోరారు. వీరభధ్రుని యొక్క జడలు శిరస్సు మీద ముడిగా చుట్టి అగస్త్య మహాముని శరణు వేడారు. అందువల్ల నేటికి లింగాకారం మీద స్పష్టంగా అగస్త్య మహాముని బాహువులు లింగాకారం మీద శిఖముడి మనకు నిదర్శనంగా కనబడుతుంది.
పూర్వము జాంబవంతుని యొక్క తపస్సు కోరిక మేరకు నారాయణమూర్తిని కృత యుగము నాటి గజేంద్రునికి మోక్షం ఇచ్చిన రూపంతో ఉండమని కోరాడు. నారాయణమూర్తి జాంబవంతుని భావన మేరకు భవననారాయణమూర్తిగా పట్టిసాంచల క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా కేశవుడు అవతరించినాడు. నేటికీ శివకేశవులు యొక్క దివ్య క్షేత్రముగా విరజిల్లుతున్న క్షేత్రం పట్టిసాంచల క్షేత్రం. గౌతమ మహాముని గో హత్య మహాపాతక నిర్మూల కోసం గోదావరి నదిని వెంట తీసుకుని వస్తూ దేవకూట పర్వతం చుట్టూ పలుమార్లు ప్రదక్షిణ చేయడంతో గోదావరి నది కూడా ప్రదక్షిణ చేయడం వల్ల .. వెంట వస్తున్న గోదావరి నది కూడా ప్రదక్షిణం చేయడంతో ఈ క్షేత్రం గోదావరి నడి గర్భంన నిండి ఉన్నది. ఫిబ్రవరి 25వ తేదీ నుండి 27 వరకు ఉత్సవాలు జరుగుతాయి.