
- వాల్మీకి రామాయణం లో సీత అన్వేషణ లోనూ ఉంది
- మహాభారతం లో హేమకోటం మే కైలాస గిరి
- ( ఆధ్యాత్మికం - ఇండియా హెరాల్డ్ ) . . .
హిమాలయాల్లో ఉండే కైలాస పర్వతం పార్వతి పరమేశ్వరుల నిలయం అన్నది ఎప్పటినుంచో పురాణాలలో ఉన్నది. అయితే కైలాసానికి ఆ పేరు ఎలా ? వచ్చిందో వరాహ తదితర పురాణాలు చాలా చక్కగా వివరించాయి. జలంలోనూ భూమిపైన స్థితమైన దానిని కేలాస అంటారు .. కేలాస అనే పదానికి స్పటిక అనే అర్థం కూడా ఉంది. అంటే హిమాలయాల పై మంచు కేలాస రూపంలో ఉంటుంది .. కనుక ఆ ప్రాంతానికి కైలాసం అనే పేరు స్థిరపడిపోయింది. వరాహ .. అధి పురాణాలతో పాటు అనేక కావ్యాలలో కైలాస పర్వత ప్రస్తావన కనిపిస్తుంది. వాల్మీకి రామాయణం కిష్కిందకాండ లో సీతా న్వేషణ కోసం సుగ్రీవుడు శతబల ఓనర సేనను ఉత్తర దిశగా పంపే సందర్భంలో కైలాస పర్వతాన్ని ప్రస్తావించాడు. భారతంలో పాండవుల గండమాదన యాత్ర తదితర అనేక సందర్భాలలో కైలాస పర్వత ప్రస్తావన ఉంది.
మహాకవి కాళిదాసు ప్రసిద్ధ రచన మేఘ దూతంలో కైలాసగిరి ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేశాడు. మహాభారతంలో కైలాస పర్వతాన్ని హేమకోటం అని అభివర్ణిస్తే .. కొన్ని పురాణాలు ఘన పర్వతం రత్నాద్రి మొదలైన పేర్లతో తెలియజేశాయి. కృత యుగంలో మందాత .. త్రాతయుగంలో రావణ భస్మాసురులు శివుడని ప్రసన్నం చేసుకునేందుకు కైలాసంలో తపస్సు చేశారు. శ్రీకృష్ణుడు - అర్జునుడు - భీముడు వ్యాస మహర్షి కైలాస పర్వతాన్ని సందర్శించారు. ఏదేమైనా కైలాసం అన్నా . . కైలాస పర్వతం అన్న భారతీయుల కు .. భారతీయ ఇతిహాసా లను ఇష్ట పడే వారికి ఎంతో సెంటిమెంట్ అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.