
యాగంటి ఉమామహేశ్వర ఆలయం గురించి కూడా తెలుగు ప్రజలు వినే ఉంటారు .. ఈ ఆలయం పరిసరాల్లో కూడా కాకలు ఉండవు .. పురాణ కథ ప్రకారం అగస్త్య మహర్షి ఇక్కడ తపస్సు చేస్తున్న సమయంలో కాకులు ఆటంకాలు కలిగించాయి .. అందుకే ఆయన శాపం కారణంగా ఇక్కడ కాకులు ఉండవు అంటారు . అలాగే యాగంటి ఆలయంలో ఉండే నంది విగ్రహం ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది .. అయితే దీని వెనక గల రహస్యాన్ని ఇప్పటికీ శాస్త్రవేత్తలు కనిపెట్టాలేకపోతున్నారు .. ఇక కాలజ్ఞాన ప్రకారం కలయుగాంతంలో ఈ నంది విగ్రహం ప్రాణం పొంది ముందుకు వెళుతుందని అంటారు .. ఈ ఆలయం కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం లో ఉంది.
ఇక తెలంగాణలోని నల్లగొండలో ఉన్న ఛాయ సోమేశ్వర ఆలయంలో కూడా ఎన్నో విశేషాలు ఉన్నాయి .. ఈ ఆలయంలో శివలింగం వెనక ఎప్పుడూ నీడ కనిపిస్తుంది .. దీని వెనక శాస్త్రీయ కారణం ఏమిటి అనేది ఎవరికీ అర్థం కాలేదు. అలాగే నల్లమల అడవుల్లో మహర్షులు తపస్సు చేసిన ప్రదేశంలో ఉమామహేశ్వర ఆలయం ఉంది .. ఈ ప్రాంతంలో నీరు ఎప్పుడూ చల్లగా ఉంటుంది .. అంతేకాకుండా ఏ కాలంలో అయినా 365 రోజులు నిరంతరం నీరు వస్తూనే ఉంటుంది .. ఈ ఆలయం కర్నూలు జిల్లాలోని మన్ననూర్ గ్రామంలో ఉంది. ఇలా మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో అంతుచుకుని ఆలయాలు ఉన్నాయా.