మన భారతీయ సంప్రదాయాల్లో సంస్కృతి సంప్రదాయాలు ఎంతో కీలకం .. అలాగే మన ప్రకృతి సహజసిద్ధమైన అందాల మధ్య ఉన్న ఆలయాలని దర్శించుకుంటే మనకున్న సమస్యలన్నీ తొలగిపోయి కోరుకున్న కోరికలు తీరుతాయని మన ప్రజలు ఎంతో విశ్వాసం చూపిస్తారు .. అలాగే మన భారతదేశంలో ఎన్నో చారిత్రక ఆలయాలు ఉన్నాయి .. ఒక్కో ఆలయానికి ఎంతో ప్రత్యేక చరిత్ర విశిష్టత ఉంది .. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా .. ప‌ర్మ‌శివుడికి సంబంధించిన ఎన్నో ఆలయాల గురించి శివలింగాల గురించి అందరికీ తెలిసి ఉంటుంది .. అలాంటిది విశిష్టమైన ఆలయం గురించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారింది .. సంతానం లేదని బాధపడుతున్నారా ? అయితే ఈ శివలింగాన్ని మూడుసార్లు ఎత్తితే పిల్లలు పుడతారట .. శ్రీ శైలానికి మించి ప్రసిద్ధి చెందిన ఆ ఆలయం ఎక్కడ ఉంది ? దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.


మత్య్సలింగేశ్వర స్వామి .. సహజ సిద్ధమైన ప్రకృతి అందాల మధ్య ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ఎన్నో కోరికలు నెరవేరుతాయి అని ప్రజలు నమ్ముతారు .. అలాగే ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకమైన చరిత్ర కూడా ఉంది .. ఈ ఆలయంలోని చాపలు ఎంతో ఆకర్షణయంగా కొలుస్తారు .. అంతేకాకుండా ఇక్కడికి వచ్చి భ‌క్త‌లు పాములను కూడా పూజలు చేస్తారు .. చుట్టూ పచ్చని కొండలు , తోటలు గలగల పారే నదులు ప్రవాహాల మధ్య ఓ కొండరాయిపై గంగా సమేత పరమేశ్వరుడు ఈ ఆలయంలో కొలువై ఉన్నాడు. మన్యం కొండల్లో వెలిసిన మత్య్సలింగేశ్వర స్వామి ఆలయం విశాఖపట్నం నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడేరు సమీపంలో ఉంది .  ఈ ఆలయానికి కొన్ని వేల సంవత్సరాల ఘన చరిత్ర ఉంది ..మత్య్సలింగేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఆలయం వెలుపల ఉన్న కోరికల లింగాన్ని మూడుసార్లు ఎత్తితే పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారని ఇక్కడికి వచ్చే భ‌క్త‌ల గట్టి నమ్మకం .. అలాగే మత్స్యాల(చేపలు)కు గుండాలు వద్ద ఉన్న చాపలకు మరమరాలు , కొబ్బరి మొక్కలు వేసినప్పుడు అవి దర్శనమిస్తే అలా వేసిన వారికి ఉన్న సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు .. ఏజెన్సీ గ్రామాల మండలాల నుంచే కాకుండా మైదాన ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడ వారి మొక్కులు చెల్లించుకుంటారు.


ఇక 1964 వ సంవత్సరంలో అప్పటి పాడేరు తహసిల్దార్ కుసర్లపాటి సత్యనారాయణ , సత్యవతి దంపతులు ఎన్నో సంవత్సరాలగా పిల్లలు లేక‌ ఎంతో బాధను అనుభవించేవారు .. ఆ సమయంలో మత్స్యలింగేశ్వరస్వామి విశిష్ట తెలుసుకొని అక్కడికి వెళ్లి వారి ముక్కులు తీర్చుకొని తమకు పిల్లలు పుట్టాలని కోరుకున్నారు .. ఆ గుడికి వచ్చిన సంవత్సరంలోపే వీరికి పిల్లల పుట్టడంతో .. 1966 - 67 సంవత్సరంలో అక్కడి ప్రజలతో చర్చించి ఆలయం నిర్మాణానికి పూనుకున్నారు .. అప్పటినుంచి ప్రతి సంవత్సరం రోజురోజుకు భక్తులు సంఖ్య పెరుగు పోవడం .. 2004లో ఏపీ టూరిజం , విశాఖ నగర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నూతన ఆలయ నిర్మాణానికి కోటి రూపాయలు వెర్చించారు.. తర్వాత 2016  -17 లో వూడా ఆధ్వర్యంలో 30 లక్షలు వెచ్చించి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆలయాన్ని ఎంతో సుందరంగా తయారు చేశారు.


పూర్వం జి ఈ మాడుగుల మండలం మత్స్యగెడ్డ వద్ద సింగరాజులు, మత్స్యరాజులు అనే రెండు రకాల దేవతలు (మత్స్యాలు) ఉండేవారు .. నిత్యం జీవనదిగా ప్రవహించే మత్స్య గెడ్డపై ఈ రెండు వర్గాల మధ్య పోరు వచ్చింది .. సుమారు మూడు నెలల పాటు మత్స్యా రాజులు , సింగరాజుల మధ్య భారీ యుద్ధం జరిగింది . ఇక యుద్ధంలో మత్స్యా రాజులు తమ‌ సంతానాన్ని మత్య లింగేశ్వర స్వామి కొలువై ఉన్న మత్స్యగుండం వద్ద స్వామివారికి అప్పగించి యుద్ధానికి వెళ్లారు .. ఇక ఆ యుద్ధంలో మత్స్యరాజులు విజయం సాధించి వచ్చి మత్స్యగుండంలో స్థిరపడినట్లు ఇక్కడి గిరిజనులు చెబుతూ ఉంటారు .. ఇక ఆ  తరవాత మత్స్యగుండంలో ఉన్న మత్యులు (చాపలు ) అలా వాటిని కొందరు సాధువులు సాధారణ చాపలుగా భావించి వాటిని పట్టుకుని ప్రాణాలు తీయడంతో .. అవే అక్కడ పెద్ద పెద్ద బండరాలుగా మారాయని.. ఇక దాంతో అప్పటినుంచి ఈ మత్స్యాలను ఎవరు చంపకుండా పూజిస్తున్నారనేది స్థానిక గిరిజనుల విశ్వాసం .. అలాగే కొబ్బరి ముక్కలు , మరమరాలు , అరటి పండ్లు వేసి భక్తులు పిలిస్తే అవి బయటికి వచ్చి తిని వెళ్ళటం భక్తులు విశ్వాసాన్ని మరింత పెంచుతూ వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: