భారతీయ సాంప్రదాయాలకు సంబంధించి ఎన్నో విషయాలు అప్పుడప్పుడు వైరల్ గా మారుతూ ఉంటాయి. అయితే ఈ సాంప్రదాయాలను చాలామంది పాటిస్తూ ఉంటారు. అలా కొంతమంది సాంప్రదాయంగా భావిస్తూ పూజిస్తున్న చెట్లలో మారేడు వృక్షం కూడా ఒకటి.. ముఖ్యంగా వృక్షాలకు సైతం ప్రత్యేకమైన పూజలు చేసి మరి దైవ సమానంగా చాలామంది భావిస్తూ ఉంటారు. అలా హిందువులు మారేడు వృక్షాన్ని కూడా చాలా పవిత్రమైన వృక్షంగా భావిస్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాలలో వీటిని ఇప్పటికీ పూజిస్తూ ఉన్నారు.

పూర్వకాలం నుంచి ఈ మారేడు చెట్టు చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నదట. మారేడు ఆకులు మూడు ఆకులు కలిపితే ఒక భాగం అన్నట్టు చాలా అద్భుతంగా ఉంటాయట.. ముఖ్యంగా త్రిదలం, త్రిగుణాకారం ,త్రినేత్రం అని ఈ ఆకులను పిలుస్తూ ఉంటారట. అయితే ఈ ఆకులను అలా మూడు ఉంచి త్రిజన్మ పాప సంహార ఏకబిల్వం అని అర్పిస్తే.. మంచి జరుగుతుందట. శివుడికి చాలా ఇష్టమైన చెట్టుగా మారేడు చెట్టుని చాలామంది పూజిస్తూ ఉంటారు. ఈ చెట్టు కింద శివుడు నివాసం ఉండేవారని మన పూర్వీకులు కూడా భావిస్తూ ఉంటారు.

సాధారణంగా వృక్షాలు పూలు పూసి,  కాయలు కాస్తూ ఉంటాయి.. అయితే ఈ మారేడు చెట్టుకు మాత్రం పువ్వు లేకుండానే కాయలు వస్తాయట. పవిత్రమైన మారేడు చెట్టుకి ప్రదక్షిణ చేస్తే మూడు కోట్ల దేవతలు సైతం మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటారని నమ్మకం ఉన్నది. అందుకే చాలామంది తమ ఇళ్ల దగ్గర లేకపోతే ఏదైనా ఖాళీ ప్రదేశాలలో మారేడు చెట్టుని పెంచుకొని వాటికి పూజ చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి ఈ మారేడు వృక్షం ఇంటి దగ్గర పెట్టుకున్నట్లయితే చెట్టు ఇంటి బాల్కనీ దాటి ఎత్తు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ మారేడు చెట్లలో పక్షులు గుళ్ళు కట్టుకుంటాయి ఇక అలా కట్టుకున్న వాటిని తొలగించకుండా వాటికి కూడా సంరక్షణ కల్పించడం మంచిదని అటు శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. ఎన్నో సద్గుణాలు కలిగిన మారేడు వృక్షం మరెన్నో ఔషధ మందుల తయారీలో కూడా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: