
ఇక పట్టణాల్లో మాత్రం స్వచ్ఛమైన ఆవు , గేదె పాలకు రెక్కలు వచ్చేశాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు చాలా మంది పట్టణాలకు సమీపంలో ప్రత్యేకంగా డెయిరీ ఫారమ్ లు పెట్టి మరీ పాలను ఉత్పత్తి చేస్తూ ఇప్పుడు ఉన్న డిమాండ్ దృష్ట్యా భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ క్రమంలోనే హర్యానా కు చెందిన సోనీ ఆవు కేవలం 24 గంటల వ్యవధి లో ఏకంగా 87.7 లీటర్ల పాలు ఇచ్చి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. కర్నాల్ జిల్లా లోని ఝిఘారికి చెందిన ఈ ఆవు కేవలం 24 గంటల్లోనే 87. 7 లీటర్ల పాలు ఇవ్వడం ద్వారా ఆసియా రికార్డు సాధించింది.
కర్నాల్ లోని నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన మేళాకు హాజరైన ఈ ఆవు ఈ ఘనత సాధించింది. సునీల్ అనే వ్యక్తి కుటుంబం మొత్తం 195 ఆవులను పెంచుతోంది. ఈ క్రమంలోనే వీరు రోజుకు 3 వేల లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తారు. సోనీకి నిత్యం 10 కిలోల పచ్చిమేత .. 20 కిలోల ప్రత్యేక దాణా పెడతామని సునీల్ తెలిపారు.