-  ఏప్రిల్ 6న శ్రీరామ న‌వ‌మి
- భ‌ద్రాద్రి రాముడి కి చీరాట ర‌ఘురామ భ‌క్త సేవా స‌మితి ఆధ్వ‌ర్యంలో కోటి గోటి త‌లంబ్రాలు
- అయోధ్య రామ మందిర నిర్మాణం తో ఈ సారి మ‌రింత‌గా శ్రీరామ న‌వ‌మి శోభ‌

- ( ఆధ్యాత్మికం - ఇండియా హెరాల్డ్ ) . . .

కల్యాణంలో అతి పవిత్రంగా భవించేవి వాటిలో తలంబ్రాలు ముందు వరుసలో ఉంటాయి. పసుపు , ముత్యాలు , ధాన్యం మేళవింపుతో వివాహ వేడుకలకు తలంబ్రాలను వినియెగిస్తారు. మరి ఇలాంటి విశిష్ట కలిగిన తలంబ్రాలు, అందులో జగత్ కల్యాణం గా భావించే భద్రాచలం సీతారాముల వారి కల్యాణ మహోత్సవంలో దేవతమూర్తుల శిరస్సు నుంచి జాలువారే తలంబ్రాలకు ఎంతో పవిత్రత ఉంటుంది. భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే సీతారాముల వారి కల్యాణానికి గడచిన 11 సంవత్సరాలుగా చీరాల ప్రాంతానికి చెందిన శ్రీ రఘురామా భక్త సేవ సమితి ఆధ్వర్యంలో కోటి గోటి తలంబ్రాలు ఒలిచి కల్యాణ వేడుకులకు తరలిస్తూ స్వామివారి సేవలో భక్తులు పునీతు లవుతున్నారు.


శ్రీరామ నామ జపం చేస్తూ 10 టన్నుల తలంబ్రాలను గోటితో ఒలిచి రాములోరి కల్యాణ వేడుకులకు తరలించడం ఆనవాయితీగా వస్తుంది. కల్యాణం మహోత్సవానికి అన్ని తామై స్వయంగా వివాహ వేడుకలను నిర్వహిస్తున్న భావన తమలో కలుగుతుందంటున్నారు నిర్వాహకులు పొత్తూరి బాలకేశవుల తో పాటు ప‌లువురు చెపుతున్నారు. ఇక ఏప్రిల్ 6న శ్రీరామ న‌వ‌మి దేశ వ్యాప్తంగా అత్యంత వైభ‌వంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రా - తెలంగాణ లోనూ ప‌ల్లెటూర్ల నుంచి ప‌ట్ట‌ణాల వ‌ర‌కు ఎక్క‌డ శ్రీరామ మందిరాలు ఉన్నా కూడా ఉద‌యం క‌ళ్యాణాన్ని వైభ‌వంగా నిర్వ‌హిచ నున్నారు. అయోధ్య‌లో శ్రీరామ మందిర నిర్మాణం త‌ర్వాత ఈ సారి మ‌రింత ఎక్కువుగా శ్రీరామ న‌వమి శోభ ప‌ల్లెటూర్ల నుంచి ప‌ట్ట‌ణాల వ‌ర‌కు సంత‌రించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: