తెలుగు వాళ్ళ తొలి పండుగ ఉగాది. ఈ ఉగాది చైత్ర శుద్ధ పాడ్యమి రోజు జరుపుకుంటారు. తెలుగు వారు ఉగాదిని ఒక పెద్ద పండగలాగా జరుపుకుంటారు. ఉదయాన్నే లేచి బ్రహ్మ ముహూర్తం లో స్నానాలు ఆచరించి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టుకొని ఎంతో నిష్ట గా పూజలు చేసుకుని షడ్రుచులు కలిపి ఉగాది పచ్చడి తయారు చేసి భక్ష్యాలు తయారు చేసి ఆ దేవుడికి పెట్టి నిష్టగా కొలుస్తారు. అయితే తెలుగు వాళ్ళు ప్రతి పండుగకు ఏదో ఒక దేవుడి ని కొలుస్తూ ఉంటారు. అలా బతుకమ్మ దసరా కి దుర్గామాత, గౌరీ దేవిని దీపావళికి లక్ష్మీ దేవిని, శ్రీరామ నవమికి శ్రీరామున్ని ఇలా హిందువుల పండుగల్లో ప్రతి ఒక్క పండగ కి ఏదో ఒక దేవుడిని ప్రధానంగా కొలుస్తారు. 

అయితే ఉగాది రోజున కూడా ఓ దేవున్ని ప్రధానంగా కొలుస్తారట.ఆ దేవున్ని కాకుండా మరో దేవున్ని పూజించరట. మరి ఇంతకీ ఉగాది రోజున ఏ దేవుని ఆశీర్వాదాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఉగాది రోజున శ్రీ మహావిష్ణువుని నియమనిష్టలతో పూజిస్తే సంవత్సరం అంతా ఆ కుటుంబం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో తులతూగుతుందట. మహావిష్ణువు మాత్రమే కాకుండా జగన్మాత అలాగే శివుడు ఈ ముగ్గురిలో ఎవరైనా ఒక దేవుణ్ణి భక్తిశ్రద్ధలతో కొలిస్తే ఆ దేవుని ఆశీస్సులు మీపై ఉంటాయి.

అయితే అసలు విషయం ఏమిటంటే.. ఏ పండుకు ఆ పండగ రోజు పూజించాల్సిన ప్రత్యేకమైన దేవుడు ఉంటారు. కానీ ఉగాది పండక్కి కాలమే దేవుడు.అందుకే ఎవరి ఇష్టమైన దేవున్ని వాళ్ళు భక్తిశ్రద్ధలతో కొలుచుకోవాలి అని పురోహితులు చెబుతున్నారు. కానీ కొంతమంది మాత్రం ఉగాదికి కచ్చితంగా ఈ ఒక్క దేవుడ్ని మాత్రమే కొలవాలి అంటూ పుకార్లు సృష్టిస్తూ ఉంటారు. కానీ అలాంటిదేమీ లేదు ఉగాది రోజు ఇష్ట దైవాన్ని పూజించడం మంచిది అని పురోహితులు చెబుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: