- ( ఆధ్యాత్మికం - ఇండియా హెరాల్డ్ ) . . .


తెలుగువారి కొత్త సంవత్సరం కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. తెలుగు పంచాంగం ప్రకారం చైత్రమాసం రోజున ఉగాది పండుగతో   కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. గత సంవత్సరం కన్నా ముందే ఈ సంవత్సరం మార్చి నెల అంతములోని ఉగాది పండుగ వచ్చింది. ఉగాది పండుగ రోజు ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఉగాది పచ్చడి తినాలని వేద పండితులు చెబుతుంటారు. అసలు ఆ రోజు ఉగాది పచ్చడి ఎందుకు తినాలి ..
ఈ కొత్త సంవత్సరం పేరేమిటి మొదలైన వివరాలను తెలుసుకుందాం. తెలుగు ప్రజలు ఎంతో ఇష్టంగా, భక్తి భావంతో జరుపుకునే పండుగలు ఉగాది పండుగకి ప్రాముఖ్యత ఉంది. ఉగాది అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది, పండుగ రోజున చేసే పచ్చడి. అన్ని పండుగలలో పిండి వంటలు ప్రత్యేకంగా నిలుస్తాయి, కానీ వాటన్నింటికంటే అధికంగా ఉగాది పచ్చడి కి ప్రత్యేక గుర్తింపు ఉంది. తీపి, కారం , ఉప్పు , పులుపు, చేదు, వగరు.. ఆరు రుచులతో తయారుచేసి పచ్చడి వెనక సాంప్రదాయంతో పాటుగా అంతకుమించిన ఆరోగ్య ప్రయోజనం కూడా ఇందులో దాగి ఉంది.


ప్రస్తుతం క్రోధి నామ సంవత్సరం లో ఉండగా మరికొన్ని గంటల్లోనే విశ్వవశు నామ సంవత్సరం ప్రారంభం కానుంది. ఉగాది పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను మనకు సూచిస్తుంది. జీవితంలో అన్ని అనుభవాలు చెప్పే భావం ఈ ఉగాది పచ్చడిలో ఇమిడి ఉంది. ఉగాది పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక..


బెల్లం :
ఉగాది పచ్చడిలో తీపిదనం కోసం కొత్త బెల్లాన్ని వాడతారు. ఆరోగ్యపరంగా బెల్లానికి జీర్ణక్రియను వృద్ధి చేసే లక్షణం ఉంటుంది. మధురమైన రుచి కోసం ఉపయోగించే బెల్లం, కొత్త సంవత్సరంలో మనకు సుఖ సంతోషాలను అందించాలని, కోరుకుంటూ కొత్త బెల్లాన్ని ఉగాది పచ్చడిలో వాడతారు.
చింతపండు :
ఉగాది పచ్చడిలో పూలుపు రుచి కోసం కొత్త చింతపండును వాడుతారు. దీనికి కఫం.. వాతం... మొదలైన రుగ్మతలను నివారిస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరూ ఓర్పుగా సహనంగా ఉండాలని కోరుకుంటూ ఉగాది పచ్చడిలో పులుపు రుచి కోసం కొత్త చింతపండును ఉపయోగిస్తారు.


కారం :
ఉగాది పచ్చడిలో కారం రుచి కోసం పచ్చిమిరపకాయలను, ఉపయోగిస్తారు. శరీరంలో ఉండే కొన్ని క్రిములు ఎన్ని మందులు వాడినా తొలగవు. అలాంటివి మన శరీరానికి హాని కలుగజేస్తాయి. ఇటువంటి హానికరమైన క్రిములను నాశనం చేసే శరీరంలో ముఖ్యమైన పంచేంద్రియాలు చురుకుగా పనిచేయడానికి కారం ఉపయోగపడుతుంది. అంతేకాక కారం కఠిన పరిస్థితులకు సంకేతంగా ఉంటుంది. అందుకే కొత్త సంవత్సరంలో ఎదురయ్యే ఎలాంటి క్లిష్టమైన, కఠిన తరమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటామని తెలిపేందుకు ఉగాది పచ్చడిలో కారం ఉపయోగిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: