తెలుగు రాష్ట్రాల ప్రజలకు అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒక్కటి ఉగాది. ఉగాది అంటే మొదటగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఉగాదికి  ప్రతి ఇంట్లో షడ్రుచులతో (ఆరు రుచులు) పచ్చడి చేస్తారు. మామిడికాయ, చింతపండు, బెల్లం, వేపపువ్వు, ఉప్పు, కారం కలిపి ఉగాది పచ్చడిని తయారుచేస్తారు. మామిడికాయలోని వగరు, బెల్లంలోని తీపి, చింతపండులోని పులుపు, ఉప్పు, కారం, వేపపువ్వులోని చేదు.. ఇలా ఆరు రకాల రుచులతో ఉగాది పచ్చడి తయారు అవుతుంది. జీవితం కూడా ఈ షడ్రుచుల లాగా ఉంటుందని ఈ ఉగాది పచ్చడి చెప్తుంది.

ఉగాది రోజున ముఖ్యంగా చేసే పనిలో ఒక్కటి పంచాంగం చూసుకోవడం. ఈ పండుగ రోజున కుటుంబం అంతా కలిసి పంచాంగం చూసుకుంటారు. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది తెలుసుకుంటారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు జాతకలు ఎలా ఉన్నాయనేది చూసుకుంటారు. ఇక ఈసారి తెలుగు ప్రజలు శ్రీ విశ్వావస్తు నామ ఉగాది సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్బంగా పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి శుభసూచకం అని తెలిపారు. పంటలు బాగా పండుతాయని.. వాతావరణం కూడా అనుకూలిస్తుందని పంచాంగ నిపుణులు వెల్లడించారు. ప్రజలు భోగభాగ్యాలతో విరాసిల్లుతారని భావిస్తున్నారు.  

అయితే ఉగాది రోజునే ఎందుకు పంచాంగం ఎందుకు చూస్తారో తెలుసా.. ఉగాది అంటే యుగాది.. కొత్త సంవత్సరం ప్రారంభం అయ్యే రోజు అని అర్దం. హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం నేడు చైత్ర మాసంలో మొదటి రోజు. 12వ శతాబ్దానికి చెందిన భాస్కరాచార్యుడు ఉగాదిని.. కొత్త సంవత్సరంగా గుర్తించాడు. దీంతో కొత్త సంవత్సరం ఆరంభం రోజున అనగా ఉగాది రోజున పంచాంగం చూస్తారు. ఇలా మొదటి రోజున పంచాంగం చూసుకోవడం వల్ల భవిష్యత్తు ఎలా ఉంటుందనేది తెలుసుకోవచ్చు. ఎలాంటి కార్యాలు చేస్తే మంచిది. ఎలాంటి శుభకార్యాలు చేయాలి, వాటికి ముహూర్తాలను తెలుసుకోవడానికి పంచాంగం ఉపయోగపడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: