
ఉగాది అంటే మొదటగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఉగాదికి ప్రతి ఇంట్లో షడ్రుచులతో (ఆరు రుచులు) పచ్చడి చేస్తారు. మామిడికాయ, చింతపండు, బెల్లం, వేపపువ్వు, ఉప్పు, కారం కలిపి ఉగాది పచ్చడిని తయారుచేస్తారు. మామిడికాయలోని వగరు, బెల్లంలోని తీపి, చింతపండులోని పులుపు, ఉప్పు, కారం, వేపపువ్వులోని చేదు.. ఇలా ఆరు రకాల రుచులతో ఉగాది పచ్చడి తయారు అవుతుంది. జీవితం కూడా ఈ షడ్రుచుల లాగా ఉంటుందని ఈ ఉగాది పచ్చడి చెప్తుంది. ఇక ఉగాది పర్వదినాన కచ్చితంగా పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. అవి ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉగాది రోజున ముఖ్యంగా చేసే పనిలో ఒక్కటి పంచాంగం చూసుకోవడం. ఈ పండుగ రోజున కుటుంబం అంతా కలిసి పంచాంగం చూసుకుంటారు. అలాగే ఉగాది పచ్చడిని తప్పకుండా కుటుంబసభ్యులతో కలిసి తినాలి. ఉగాది రోజున కచ్చితంగా తలంటూ సాన్నం చేయాలి. అసలు కంఠసాన్నం చేయకోడదు. ఉగాది రోజున కొత్త దుస్తులను మాత్రమే ధరించాలి. పండుగ రోజున అసలు దిగులు చేయకుండా ఉండాలి. ఈ ఉగాది రోజున ఎలా అయితే ఉంటామో.. సంవత్సరం మొత్తం అలాగే ఉంటామని పెద్దలు నమ్ముతారు. పండుగ పుట ఎవరైనా ఏదైనా అడిగితే లేదు అని చెప్పకోడదు. ఒకవేళ మీ దగ్గర లేకపోయిన కూడా చూసి ఇస్తాను.. వెతికి ఇస్తాను.. తర్వాత ఇస్తాను అని చెప్పాలి. అలాగే ఎవరితోనూ తగువులకు పోరాదు. ఉగాది రోజున మాంసం తినరాదు.