ముస్లింల అత్యంత ప్రీతిపాత్రమైన పండగల్లో రంజాన్ చాలా ప్రత్యేకమైనది. రంజాన్ మాసం వచ్చిందంటే ముస్లిం సోదరులంతా ప్రత్యేక ఉపవాసాలు ఉండి  ప్రార్థనలు చేస్తూ భక్తిశ్రద్ధలు వహిస్తారు. అలాంటి రంజాన్ పండగ సందర్భంగా అనేక నియమాలు పాటిస్తారు. మరి రంజాన్ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ రోజు దివ్య ఖురాన్ గ్రంథం దివి నుంచి భువికి వచ్చిందని వారు నమ్ముతారు. ఈ నెలలో వారు ఎలాంటి ఆలోచనలు లేకుండా శరీరాన్ని కంట్రోల్ చేసుకొని చాలా భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలో ఉంటారు.  రంజాన్ సమయంలో ముస్లింలు తెల్లవారుజామున నాలుగు గంటలకే ఆహారం తింటారు. మళ్లీ సూర్యోదయం నుంచి మొదలు సూర్యాస్తమయ వరకు  కనీసం లాలాజలం కూడా మింగరు. ఈ విధంగా ఖఠోర ఉపవాసం ఉంటారు. 

ఈ దీక్షలో వయసుతో తారతమ్యం ఏమీ ఉండదు. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ భక్తిశ్రద్ధలతోనే ఉంటారు. రంజాన్ నెల చివరి పది రోజుల్లోనే ఖురాన్ భూమిని చేరిందని, ముస్లింలు నమ్ముతారు.. అందుకే సంవత్సరం అంతా ఎలాంటి దానధర్మాలు చేయకపోయినా రంజాన్ మాసంలోని చివరి పది రోజులు మాత్రం దానధర్మాలు చేస్తూ ఉపవాస దీక్షలో పూనుకుంటారు.. ఉపవాస దీక్షలో అనారోగ్యం ఉన్న వృద్ధులు, పిల్లలు తప్ప ప్రతి ఒక్కరూ కఠోర దీక్షలోనే ఉంటారు. అలాగే రంజాన్ పండుగను ఈతూర్, పీతరు అని కూడా పిలుస్తారు. బాల చంద్రుని దర్శించుకున్న తర్వాత రోజు  ఈ పండగను జరుపుకుంటారు.

 పండగ రోజు మసీదులోకి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు కుల మత భేదాలకు అతీతంగా అందరూ ఆలింగనం చేసుకొని, షీర్ కుర్మా అనబడే తీయటి పానీయం తింటారు. అయితే ఈ ఉపవాస దీక్షల సమయం చేయడం వల్ల జీర్ణశక్తి పెరిగి చాలా ఆరోగ్యంగా ఉంటారట. ఈ ఉపవాస దీక్షలు షాహారితో ప్రారంభమై ఇఫ్తార్ తో ముగుస్తాయి. ఈ విధంగా ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో చాలా నిష్టగా ఉపవాస దీక్షలు చేసి  అల్లా దీవెనలు కోరుకొని ఆరోగ్యంగా హ్యాపీగా జీవించాలని ప్రార్థనలు చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: