- ( ఆధ్యాత్మికం - ఇండియా హెరాల్డ్ ) . . .

మ‌న దేశంలో హిందూ పండ‌గ‌లు ఎన్నో ఉంటాయి. ప్ర‌తి పండుగ‌కు ఓ స్పెషాలిటీ ఉంటుంది. . హిందూ పండుగ‌లు భార‌తీయ సంస్కృతిలో కొన్ని వేళ ఏళ్ల నుంచి అంత‌ర్భాగం అయిపోయాయి. అయితే ఈ హిందూ పండుగ ల‌లో ప్ర‌తి పండుగ‌కు ఓ స్పెషాలిటీ .. ఓ ప్ర‌త్యేక‌త ఉన్నాయి. మ‌రి ఏ పండుగ స్పెష‌ల్ ఏంటో కింద తెలుసుకుందాం.


* ఉగాది :- కష్టము, సుఖము, సంతోషము, బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని.
* శ్రీరామ నవమి :- భార్య - భర్తల అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి.
* అక్షయ తృతీయ :- విలువైన వాటిని  కూడబెట్టుకోమని.
* వ్యాస ( గురు ) పౌర్ణమి :- జ్ఞానాన్ని అందించిన గురువును మరువొద్దు అని.
* నాగుల చవితి :- ప్రాణాల్ని తీసేదయిన సరే తోటి జీవులను ప్రేమగా అధరించమని.
* వరలక్ష్మి వ్రతం:-  నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ, అందరితో కలిసి సంతోషంగా ఉండమని.
* రాఖీ పౌర్ణమి :- తోడబుట్టిన బంధం ఎప్పటికి విడరాదు అని.


* వినాయక చవితి ( నవరాత్రులు ) :- ఊరంతా ఒక్కటిగా కలవడానికి.
* పితృ అమావాస్య :- చనిపోయిన వారిని ఎప్పటికి మరువకు అని చెపుతూ.
* దసరా ( ఆయుధ పూజ ) :- ఎప్పుడు నీకు అండగా నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించమని తెలిపేది.
* దీపావళి :- పది మందికి వెలుగు చూపే జీవనం నీదవాలని.
* కార్తీక పౌర్ణమి :- చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలువమని.
* సంక్రాంతి :-  మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం,  అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరుపమని.
* మహాశివరాత్రి :- కాలం మారుతోంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని

మరింత సమాచారం తెలుసుకోండి: