రెండు తెలుగు రాష్ట్రాలలోని భక్తులు సైతం శ్రీరామనవమి రోజున భద్రాచలంకు వెళుతూ ఉంటారు.. అక్కడ శ్రీ సీతారాముల కల్యాణ బ్రహ్మోత్సవాలు చూడడానికి వెళుతూ ఉంటారు. 16వ శతాబ్దంలోని పోకల దమ్మక్క అనే భక్తురాలు భద్రాచల ప్రాంతంలో తాటాకు పందిరి వేసి మరి స్వామివారిని పూజిస్తూ ఉండేదట ఆ తర్వాత అక్కడ ఆలయాన్ని 1674లో కంచర్ల గోపన్న ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అప్పటినుంచి ఇప్పటివరకు భక్తులు శ్రీరాముని పూజిస్తూ ఉన్నారు. ప్రతి ఏడాది శ్రీరామ నవమి ఉత్సవాలు కూడా చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంటాయి. మరి ఈసారి దర్శన వేళల విషయానికి వస్తే..


తెల్లవారుజామున..4.30 గంటలకు సుప్రభాత సేవతో మొదలవుతుంది. ఈ సేవలో పాల్గొనాలి అంటే 200 రూపాయల టికెట్ తీసుకోవాలి.

ఉదయం 5.30 నిమిషాల నుంచి ఏడు గంటల వరకు బాల భోగం చేస్తారట.


ఉదయం 8.30 నిమిషాల నుంచి 9:30 నిమిషాల వరకు సహస్ర నామార్చన జరుగుతుంది. ఈ పూజకు దంపతులు ప్రవేశం ఉంటుంది.. ఎందుకు 200 రూపాయల టికెట్ తీసుకోవాలి.


ఇక మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మూడు గంటల వరకు ఆలయం తలుపులు మూసి ఉంటాయి.


మధ్యాహ్నం మూడు నుంచి 9:30 రాత్రి వరకు భక్తులు దర్శనం సదుపాయం ఉంటుంది.


ఇక రాత్రి 7 గంటలకు దర్బారు సేవ ఈ సేవను చూసేందుకు ₹100 టికెట్ తో ప్రత్యేక దర్శనం చేయిస్తారట.


ఒకవేళ టికెట్ లేనివారు పడమర మెట్ల వైపు నుంచి రాజగోపురం గుండా దర్శించుకోవచ్చు. అయితే అక్కడ ఉండే స్థానికులకు  మంగళ, బుదు,గురు మూడు రోజులు సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు ప్రత్యేక దర్శనం కలిగి ఉంటుంది.


60 ఏళ్లు దాటిన వృద్ధులతో పాటు చిన్నపిల్లల తల్లులు దివ్యాంగులకు సైతం ప్రత్యేకమైన దర్శన భాగ్యం కల్పిస్తున్నారట. భద్రాచలం నుంచి ఆర్టీసీ బస్సులు ప్రైవేటు వాహనాల భద్రాచలానికి చేరుకోవచ్చు.


ఇక శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో నిర్వహించేటువంటి పూజలను సైతం ఆన్లైన్ ద్వారా మనం వీక్షించుకోవచ్చు. టికెట్లు కూడా తీసుకోవచ్చు.

భద్రాచలంలో ప్రత్యేకమైన అర్చనలు చేయించాలి అంటే ఆదివారం మినహా ఉదయం 7 నుంచి పాల్గొనవచ్చు అభిషేకాల కోసం 1500 రూపాయల టికెట్లు తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: