
శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుభాహుం అరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి.
వాల్మీకి అనే మహర్షి ఓ రోజు తమాసా నదికి స్నానమాచరించడానికి వెళ్ళాడు. ఈ సమయంలోనే ఎదురుగా ఉన్న ఒక చెట్టుపై ఆనంద సాగరంలో మునిగి తేలుతున్నటువంటి పక్షుల జంటను చూశాడు. దీంతో తన బాణాన్ని ఎక్కుపెట్టి అందులో మగ పక్షిని చంపేశాడు. వెంటనే ఆ గూడు నుంచి మగ పక్షి కింద పడిపోవడంతో దాని చుట్టూ ఆడ పక్షి విలవిలా ఏడ్చుకుంటూ చుట్టూ తిరుగుతోంది. దీంతో వాల్మీకి మనసు కరిగిపోయి ఒక శ్లోకాన్ని పాడాడు.
మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః|
యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్| |
అయితే ఆయన పక్షిని చంపడంతో ఓ కిరాతకుడా కామ పరవశమై ఉండగా ఓ పక్షిని చంపావు. నువ్వు ఎక్కువ కాలం బ్రతకవు అంటూ దేవతలు శపించారు. వెంటనే ప్రత్యక్షమైనటువంటి బ్రహ్మదేవుడు నీ నోట ఒక మంచి కవిత్వం వచ్చింది. నువ్వు రామాయణ మహా కావ్యాన్ని రచించి మానవాళికి తరింపజేయమంటూ ఆజ్ఞాపించాడు. అక్కడినుంచి రామాయణ మహాకావ్యం మొదలైంది.
బాలకాండ:
అయోధ్య నగరంలో రామలక్ష్మణ,, భరత, శత్రుజ్ఞులు ధనుర్విద్యలో మంచి పట్టు సాధించారు. ఇదే తరుణంలో విశ్వామిత్రుడు దశరథుని వద్దకు వచ్చి రాక్షసులు నా యాగానికి ఆటంకం కలిగిస్తున్నారు. వారిని నేను శపించి సంహరించవచ్చు కానీ యాగంలో ఉన్నప్పుడు కోపం పనికిరాదు అంటూ చెప్పారు. మా యాగ రక్షణ జరగాలి అంటే నీ కుమారులను నాతో పంపాలని దశరధునికి చెప్పాడు. దీంతో దశరథుడు రాక్షసులను చంపడానికి నా కుమారులను ఎలా పంపగలను అంటూ కాస్త సంకోచించాడు. వారికి బదులు నేనే వస్తానని చెప్పాడు. దీంతో విశ్వామిత్రుడు ఇది రాజధర్మం కాదు నువ్వు మాట తప్పుతున్నావు అని చెప్పగానే దశరథుడు వారి కుమారులను విశ్వామిత్రుడితో పంపుతారు. తన వెంట వచ్చినటువంటి రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు సరయు నది తీరంలో ఆకలి దప్పికలు మరచిపోయి ఎలా యుద్ధం చేయాలో ఆ విద్యలో ప్రావీణ్యం అందిస్తాడు. దీంతో దశరథని కుమారులు అందరూ కలిసి ఈ విద్యలో ఆరి తేరుతారు.