చైత్రమాసంలోని శుక్లపక్షం తొమ్మిదవ రోజుని శ్రీరామ నవమిగా జరుపుకుంటారు. శ్రీరాముడి జన్మ దినోత్సవంగా శ్రీరామ నవమిని పిలుస్తారు. ఎంతో పవిత్రంగా జరుపుకునే శ్రీరామనవమి పండగ వేళ భక్తులు భక్తిశ్రద్ధలతో శ్రీరాముడిని కొలిచి ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో సంవత్సరమంతా తులతూగాలని కోరికలు కోరుకుంటూ ఉంటారు. ఇక శ్రీరామనవమి రోజు భక్తిశ్రద్ధలతో రామున్ని కొలిస్తే కోరిన కోరికలు తీరుస్తారు అనే నమ్మకం ఉంది. శ్రీరామ నవమి రోజు సీతారాముల కళ్యాణం కూడా జరుగుతుంది. అయితే అలాంటి శ్రీరామ నవమి రోజు ఈ ఒక్క పని చేస్తే ఖచ్చితంగా నెల రోజుల్లో గుడ్ న్యూస్ వింటారని ఆధ్యాత్మిక గురువులు చెబుతున్నారు.

అయితే కొంతమందికి ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లిళ్లు సెట్ అవ్వవు. ఒకవేళ అమ్మాయి అబ్బాయి ఇష్టపడినా కూడా ఏదో ఒక కారణంతో ఆ పెళ్లి చెడిపోతూ ఉంటాయి. అయితే అలాంటి పెళ్లి సెట్ అవ్వని వారు శ్రీరామ నవమి రోజు ఈ ఒక్క పని చేస్తే ఖచ్చితంగా నెల రోజుల్లో వారికి పెళ్లి ఫిక్స్ అవుతుందట.మరి ఇంతకీ శ్రీరామనవమి రోజు చేయాల్సిన ఆ పని ఏంటంటే.. శ్రీరామనవమి వేడుకలు జరిగిన రోజు సాయంత్రం వివాహం కాని వారు ఆ శ్రీరాముని గుడికి వెళ్లి సీతారామస్వామి వారికి పసుపు,గంధం, కుంకుమ సమర్పించి భక్తిశ్రద్ధలతో కొలిచి "ఓం జై సీతారాం" అనే మంత్రాన్ని 108 సార్లు మనసులో పఠిస్తే చాలు ఆ వ్యక్తికి నెల రోజుల్లో కచ్చితంగా వివాహానికి సంబంధించి గుడ్ న్యూస్ వింటాడు.

ఇక ఈ మంత్రం జపిస్తే కేవలం వివాహం మాత్రమే కాదు వారి కుటుంబం సుఖసంతోషాలతో సంవత్సరమంతా ఎంతో హ్యాపీగా గడుపుతుంది. ఇక ఎన్ని రోజులైనా పిల్లలు లేనివారు సీతారామ స్వామి వారిని దర్శించి ఒక ఎర్రటి వస్త్రంలో కొబ్బరికాయను కట్టి ఆ సీతా దేవికి సమర్పించడంతో పాటు "ఓం నమః శివాయా" అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే కచ్చితంగా సంతాన సమస్య తొలగిపోతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: