చాలామందికి ఫేవరెట్ గాడ్ గా హనుమంతుడు ఉంటాడు. హనుమంతుడు బలా పరక్రమానికి  నిజ స్వరూపుడు. భయం వేసినప్పుడు చాలామంది హనుమాన్ అంటే వారి భయం తొలగిపోయి హ్యాపీ గా జీవిస్తారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు హనుమంతున్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇక వేసవి కాలంలో హనుమాన్ మాలలు వేసి ప్రత్యేకంగా  నిష్ఠతో ఉంటారు. అలాంటి  బజరంగ బలికి  ఈ ఇష్టమైన నైవేద్యం పెడితే మనకు ఎలాంటి బలమైన కోరికలు అయినా నెరవేరుతాయట. మరి ఆ నైవేద్యం ఏమిటి వివరాలు చూద్దాం. ఈ నైవేద్యాన్ని హనుమాన్ జయంతి  సందర్భంగా పెడితే హనుమంతుడి అనుగ్రహం మనపై మరింత పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. హనుమాన్ జయంతి అంటే హనుమంతుడు జన్మించిన రోజు అని అర్థం. 

చైత్ర పౌర్ణమి రోజున భారతదేశంలోని చాలా ప్రాంతాలలో హనుమంతుని జయంతి గా జరుపుతారు. ఈరోజు చాలామంది ఉపవాసం ఉండి విశేష పూజలు చేసి, హనుమాన్ చాలీసా, పారాయణం, భజనలు చేస్తూ ఉంటారు. అలాంటి ఈ హనుమాన్ జయంతి రోజున హనుమంతుడికి నైవేద్యంగా వడలు సమర్పిస్తే చాలా మంచిది. వడలతో కూడిన ఆహారాన్ని కొన్ని ప్రాంతాల్లో హనుమంతునికి సమర్పించే ఆచారం  ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ నైవేద్యాన్ని హనుమంతుడికి సమర్పిస్తే ఆరోగ్యం, విద్య, అద్భుతంగా కలుగుతాయట.

పెద్దవాళ్లు సమర్పిస్తే వాళ్ళు చేసే పని లో ఆర్థిక వృద్ధి చెందడం కాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నమ్ముతారు. అయితే ఈ నైవేద్యం సమర్పించే సమయంలో భక్తులు పొద్దున్నే లేచి తలంటు స్నానం చేసి ఇల్లంతా శుద్ధి చేసుకుని, పూలతో అలంకరించుకోవాలట. ఆ తర్వాత హనుమాన్ దేవాలయానికైనా వెళ్లాలి లేదంటే హనుమాన్ చిత్రపటానికి చందనంతో బొట్టు పెట్టి  తమలపాకులు,  నెయ్యి,  పూలతో పూజించి, మీరు తయారు చేసిన వడలను నైవేద్యంగా సమర్పిస్తే ఎలాంటి పెద్ద కోరికలైనా ఇట్టే తీరిపోతాయని భక్తులను నమ్మకం.

మరింత సమాచారం తెలుసుకోండి: