ప్రతి ఊర్లలో కూడా హనుమంతుడి దేవాలయం కచ్చితంగా ఉండనే ఉంటుంది.. ఎక్కువమంది భక్తులు కూడా ఆంజనేయస్వామిని పూజిస్తూ ఉంటారు. హనుమంతుడు వాన సంతతికి జన్మించిన వారు. ఇక ఆంజనేయస్వామి తల్లి అంజనాదేవి.. బృహస్మృతికి ఇచ్చినటువంటి శాపం కారణంగానే భూలోకానికి వచ్చి మరి కేసరి నందుడు అనే వారసుడిని వివాహం చేసుకొని వాయుదేవుని అనుగ్రహంతో తిరుమలలో ఉండేటువంటి అంజనద్రి పైన జన్మించినట్లు మన పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ రోజున ఆంజనేయస్వామి హనుమాన్ జయంతి సందర్భంగా చాలా గ్రామాలలో పెద్దగా పండుగను చేసుకుంటూ ఉంటారు.


హిందూ పురాణాల ప్రకారం చైత్రమాసం పౌర్ణమి ఎంతో ప్రత్యేకమైనదిగా మన పురాణాలు సైతం తెలియజేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ రోజున హనుమాన్ జయంతి.. ఇప్పటికీ కూడా హనుమంతుడు బ్రతికే ఉన్నారని భక్తులు నమ్ముతూ ఉంటారు. కలియుగంలో ఆయన హిమాలయ పర్వతాలలో కూడా తపస్సు చేస్తున్నట్లుగా చూపించారు భక్తులు భక్తిశ్రద్ధలతో కోరుకున్న కోరికలను కూడా తీరుస్తూ ఉంటారని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ రోజున తెల్లవారుజామున 3:20 గంటలకు చైత్ర పూర్ణమి తిది ప్రారంభమవుతుందట. ఇది రేపటి రోజున ఉదయం 5:52 నిమిషాలకు ముగుస్తుందని తెలుపుతున్నారు.


ఈ రోజున హనుమాన్ చాలిస్ చదువుతూ హనుమాన్ భక్తులు పండుగను చాలా గ్రాండ్గా చేసుకుంటూ ఉంటారు. హనుమంతుడు రామాయణం లోనే కాకుండా మహాభారతం వంటి వాటిలో కూడా ఉన్నారు.  శ్రీ ఆంజనేయస్వామి తిరుమల లోని అంజనాద్రి పైన జన్మించినట్లు మన పురాణాలు సైతం తెలియజేస్తూ ఉన్నాయి. అందుకే ఈ రోజున హనుమంతుడు జన్మదినంగా జరుపుకోవడమే కాకుండా ఈ రోజున హనుమంతుడిని స్మరించి కష్టాలు చెప్పుకుంటే తీర్తాయని కూడా భక్తులు నమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా ఈరోజు శివుని రుద్ర అవతారంలో కూడా హనుమంతుడు జన్మించినట్లుగా మన పురాణాలు తెలియజేస్తున్నాయి. చెడు పైన విజయం సాధించడానికి కూడా హనుమంతుడు జన్మించారని పురాణాలు తెలుపుతున్నాయి.శ్రీరాముని భక్తుడు సీతమ్మ వారి పట్ల భక్తి గురించి చెప్పాల్సిన పనిలేదు. సీతారాముల  వద్దని హనుమంతుడు ఎప్పుడూ ఉండనే ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: