హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. హనుమంతుడు మహాపరాక్రమవంతుడు.. హనుమంతుడు అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు. ఎర్రని కన్నులుగల వానరుడు. శతయోజన విస్తారమైన సముద్రమును దాటినవాడు. లంకలో బందీయైన సీతమ్మతల్లి శోకమును హరించినవాడు.
ఔషధీ సమేతముగా ద్రోణాచలమును మోసుక వచ్చి యుద్ధమున వివశుడైన లక్ష్మణుని ప్రాణములు నిలిపినవాడు. దశకంఠుడైన రావణాసురుని గర్వమును అణచినవాడు. హనుమంతుని ఈ నామములు నిదురించుటకు ముందు, ప్రయాణమునకు ముందు స్మరించినవారికి మృత్యుభయం లేదు. వారికి సర్వత్ర విజయం లభిస్తుంది.చైత్ర శుక్ల పూర్ణిమ నాడు హనుమాన్ జయంతిని వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున హనుమద్భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు. శ్రీ ఆంజనేయస్వామి వారి జన్మదినం చైత్ర శుక్ల పూర్ణిమ రోజున జరిగింది కాబట్టి ఆ రోజున స్వామివారిని పూజించే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు.
"యత్ర యత్ర రఘునాథకీర్తనం - తత్ర తత్ర స్తుతమస్తకాంజలిమ్
భాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షశాంతకామ్"
"యెక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగునో, అక్కడక్కడ మారుతి ఆనందబాష్పములునిండిన కళ్ళతో, చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ ఉండును" అని అర్థం.
చైత్ర శుక్ల పూర్ణిమ నాడు మాత్రమే గాకుండా ఆంజనేయ స్వామిని శనివారం, మంగళవారం ఇంకా గురువారాల్లో పూజిస్తే మంచి ఫలితాలుంటాయి. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు. అందుకే యెడున్నర యేళ్ళ శని దోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ, గురు, శని వారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకోవచ్చునని పురోహితులు చెబుతున్నారు.
మన దేశంలో హనుమన్ ఆలయాలు కోకొల్లలు.శృంగేరి లో ఆదిశంకరరా చార్యులవారు ప్రతిష్టిం చిన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది .దీన్ని కేరే ఆంజనేయ దేవాలయం అంటారు. కర్నూలు లో అహోబిల –శ్రీ కరంజ ఆంజనేయ స్వామి దేవాలయంఉంది.ఈయనను ఆంజనే యుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజని సుతుడు , రామ భక్త వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. ఆంధ్ర ప్రదే శ్లో హనుమంతుని గుడి లేని ఊరేలేదనవచ్చు.
మన తెలుగునాట హనుమాన్ జంక్షన్ వద్ద అభయాంజనేయ స్వామి ఆలయం.తణుకు దగ్గర తీపర్రు లో ప్రసన్న ఏకాదశముఖి వీరాంజనేయ స్వామి ఆలయం ,గురవాయిగూడెం మద్ది వీరాంజ నేయ స్వామి,విజయవాడలోదాసాంజనేయస్వామి, మాచవరం సురేంద్రపురి, యాదగిరి గుట్ట పంచ ముఖ హనుమ దీశ్వరాలయం.
తిరుమల లో కోనేటి గట్టు ఆంజనేయ స్వామి, బేడీ ఆంజనేయస్వామి, జాబాలి తీర్థం,రాజమండ్రి సుందర ఆంజనేయస్వామి దేవాలయం,కాకినాడ , మామిడాడ వద్ద పంచముఖ ఆంజనేయ స్వామిగుడి , అరగొండ- అర్ధగిరి ఆంజనేయస్వామి దేవాలయం ఉంది.
అంతే కాదు చిత్తూరు జిల్లా లో భర్తి పూడి, బాపట్ల మండలం లో ప్రసన్నాంజనేయ స్వామి, కర్నూలు జిల్లా కసాపురం నెట్టెకంటి ఆంజనేయస్వామి, ప్రకాశం జిల్లావేటపాలెం, పొన్నూరు ఆంజనేయ స్వామి, సామర్లకోట ఆంజనేయస్వామి. ఆంజనేయపుణ్యక్షేత్రాలను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుం దని విశ్వాసం. విదేశాల్లోనూ సైతం భక్తుల కొంగుబంగారమైన ఆంజనేయస్వామి ఆలయాలు అనేకం