రామాయణము భారతీయ వాఙ్మయములో ఆదికావ్యముగాను, దానిని సంస్కృతములో రచించిన వాల్మీకి ఆదికవిగాను సుప్రసిధ్ధము. సాహిత్య చరిత్ర ప్రకారం రామాయణ కావ్యము వేదకాలం తర్వాత, అనగా సుమారు క్రీ.పూ. 15000 లో దేవనాగరిభాష లిపిలో సంస్కృత భాషలో రచించబడినది. రామాయణం కావ్యంలోని కథ త్రేతా యుగం కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నారు.
భారతదేశంలోని అన్ని భాషల యందు,
అన్ని ప్రాంతములందు ఈ కావ్యము ఎంతో ఆదరణీయము,పూజనీయము. ఇండొనీషియా, థాయిలాండ్, కంబోడియా,
మలేషియా, వియత్నాం, లావోస్ దేశాలలో కూడా రామాయణ గాథ ప్రచారంలో ఉంది. ఇండోనీషియాలోని
బాలి దీవిలో రామాయణము నృత్య నాటకము ప్రపంచ ప్రసిద్ధము.
మనం చదివే రామాయణంలోని రాముడు, సీత, లక్ష్మణుడు, అంజనేయుడు గురించి పెద్దవాళ్ళు చెప్పడం లేదా ఎక్కడైనా చదవడం తప్ప అది నిజంగా వారు ఉండే వారా! అంటే ఎవరు సరిగా చెప్పలేరు. కానీ, మేము మాత్రం రావణుడు గురించి మాత్రం ఖచ్చితంగా చెప్పగలం అంటున్నారు శ్రీలంక వాసులు.
అవును ఎందుకంటే అక్కడ వారి పురావస్తు శాఖ వారు గుర్తించిన కొన్ని ఆనవాళ్ళు దొరికాయి. అందులో ముఖ్యంగా రావణుడు నివసించింది మాత్రం మా లంకలోనే అంటున్నారు. ఎందు కంటే అక్కడ దొరికిన ఆధారాల ప్రకారం ఖచ్చితంగా రావణుడు ఇక్కడే నివసించాడు అనడానికి రుజువులతో సహా నిరూపిస్తున్నారు.
లంకేయుడు ప్రపంచాన్ని జయించిన తర్వాత లంకంత బంగారాన్నితీసుకువచ్చి దానిని దాచి పెట్టేందుకు సముద్రం మధ్యలో నిర్మించిన మాహా నగరమే ఈ లంక. రావణుడు నిర్మించిన ఈ లంకలో రావణుడి సాక్ష్యాలు మనకు అణువణువూ కనిపిస్తాయి. ఇదే విషయాన్ని శ్రీలంక ప్రభుత్వం కూడా గుర్తించి రాజ ముద్ర కూడా ఇచ్చింది.
అలాగే ఆశోకవనం సీతమ్మ తల్లిని రావణుడు ఎత్తుకెళ్ళి బందించిన లంక దాచిన స్థలం ఇప్పుడు దానిని శ్రీలంకలో ఆశోకవాటికగా పిలుస్తున్నారని ఎవరో చెప్పడం కాదు స్వయం గా శ్రీలంక ప్రభుత్వమే చెబుతుంది. ఈ ప్రదేశంలో వేల సంవత్సరాల నాటి విగ్రహాలు ఉన్నాయి వీరిని మాత్రం ఎవరు ప్రతిష్టించారో అది మాత్రం ఇంత వరకు తెలియదు. అలాగే ఆ విగ్రహాల పక్కనే ఒక ఏరు పారుతుంది, అది సీత కన్నీటితో ఏర్పడిన నీటి గుండమని లంకేయులు చెబుతున్నారు.
ఈ ఆశోక వాటికకు సమీపంలోనే మరో విశేషం ఉంది. అదేంటంటే, ఆ వాటిక సమీపంలో ఉండే అడవులలో నల్లటి మట్టి ఉంటుంది. అది ఇక్కడ మాత్రమే లభించడం, అలాగే ఇక్కడ అధికం గా కోతులు ఉండటం ఆశోక వాటికకు పురాణ సంతతి నెలకొంది.
ఇక్కడ సీత ఏరుకు పక్కనే మరో ఏరు పారుతుంది. ఆ ఏరులోనే రావణుడు నిత్యం స్నానం ఆచరించి పరమ శివుడిని ఆరాధించేవాడని లంక వాసులు చెబుతున్నారు. రావణుడు స్నానం ఆచరించిన నది దగ్గర నుండి చూస్తే ఒక పర్వతం కనిపిస్తుంది అది అచ్చం అంజనేయుడు నిద్రిస్తున్నట్టు ఉంటుంది.
దానీ ఇక్కడ రామ్-సోల అని వ్యవహరిస్తారు. లక్ష్మణుడు మూర్చ సమయంలో హనుమ తీసుకు వస్తున్న సంజీవని లో ఒక ముక్క ఇదే అని స్థానికులు చెబుతున్నారు. మరి విచిత్రం కాకపోతే ఒక కొండను చూపిస్తూ ఇదే సంజీవని అంటే నమ్మేది ఎలా? అని అనవచ్చు. అయితే శ్రీలంక మొత్తంలో ఇలాంటి పర్వతం మరొకటి లేదు అలాగే ప్రపంచ వాసులకు ఇది కొండలాగా కనిపించిన శ్రీలంకవాసులకు ఇది రోగాలను నయంచేసే పర్వతం. ఈ పర్వతం అనేక రోగాలను తగ్గించే ఔషధమొక్కలు నిలయం. అందుకే ఈ పర్వత ప్రాంతంలో ఉండే ప్రజలంతా ఎలాంటి జబ్బులకైన ఇక్కడి మూలికలు తీసుకోవడం విశేషం.
అనేక అంతర్జాతీయ ఔషధ కంపెనీల వారు వచ్చి ఇక్కడ పరిశోధనలు జరిపి ఇక్కడ పెరిగే మొక్కలకు అనువైన మట్టి ఒక హిమాలయాలలోనే ఉండటంతో ఈ కొండ మరింత విశిష్టతను తెలుపుతుంది అందుకే లంకేయులు ఇది రావణ రాజ్యం అని అంటున్నారు.