భారత్ గడ్డపై
బంగ్లాదేశ్ పర్యటన ఆదివారం నుంచి మొదలవబోతోంది. ఈరోజు ఢిల్లీలోని
అరుణ్ జైట్లీ (ఫిరోజ్ షా కోట్ల) స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకి తొలి
టీ20 మ్యాచ్ ప్రారంభం కానున్నది. ఇక సిరీస్‌లో మొత్తం మూడు టీ20లు, రెండు టెస్టులు జరగనుండగా..
బంగ్లాదేశ్ అగ్రశ్రేణి ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ నిషేధం కారణంగా సిరీస్ మొత్తానికీ దూరమవడం దూరం అవ్వడం జరిగింది. మరోవైపు
భారత్ కూడా టీ20ల్లో
విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చి ఓపెనర్
రోహిత్ శర్మ చేతికి పగ్గాలు ఇవ్వడం జరిగింది.
ఆస్ట్రేలియా వేదికగా వచ్చే ఏడాది
టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో.. ఈ సిరీస్ నుంచి టోర్నీ సన్నద్ధతని ప్రారంభించాలని టీమిండియా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జట్టులో మార్పులు చోటుచేసుకోగా.. శివమ్ దూబే లాంటి పవర్ హిట్టర్‌కి చోటు లభించడం జరిగింది. అలానే బ్యాటింగ్ ఆర్డర్‌లోనూ మార్పులు జరిగే సూచనలు కూడా ఉన్నాయి అని సమాచారం. వికెట్ కీపర్‌గా
రిషబ్ పంత్‌కి మరో అవకాశమిస్తారా..? ఇవ్వరా? సంజు శాంసన్‌కి ఫస్ట్ అవకాశమిస్తారా..? అనేదానిపై స్పష్టత ఇంకా రావడం లేదు.
ఇక రికార్డుల పరంగా చూసుకుంటే టీ20ల్లో బంగ్లాదేశ్‌పై పూర్తి స్థాయిలో
భారత్ ఆధిపత్యం బాగా ఉంది అని తెలుస్తుంది. ఇప్పటి వరకు మొత్తం 8 టీ20ల్లో ఈ రెండు జట్లు తలపడగా.. అన్నింటిలోనూ టీమిండియాదే విజయం సాధించింది. అయితే.. ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఇప్పటి వరకూ టీ20ల్లో తలపడిన ఈ రెండు జట్లు తొలిసారి ద్వైపాక్షిక సిరీస్‌లో తలపడ బోతున్నాయి.
ఇక
అరుణ్ జైట్లీ స్టేడియంలో 2017లో చివరిగా
టీ20 మ్యాచ్ ఆడిన భారత్.. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 53 పరుగుల తేడాతో గెలుపు కైవసం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. మరి ఈ మ్యాచ్ లో విజయం ఎవరు దక్కించు కుంటారో చూడాలి మరి.