వెస్టిండీస్ జట్టు ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లతో తరచూ గొడవపడే పొలార్డ్ కి ఫీల్డ్ అంపైర్లు వార్నింగ్ కూడా ఇస్తుంటారు. ఆ హెచ్చరికలకి కూడా పొలార్డ్ తనదైన శైలిలోనే కౌంటర్లిస్తుంటాడు. ఐపీఎల్ లో
ముంబయి ఇండియన్స్ కి ఆడే పొలార్డ్ ఒక సారి క్రిస్‌గేల్ తో గొడవపడితే అంపైర్ వార్నింగ్ ఇచ్చాడు. దీనితో నోటికి ప్లాస్టర్ వేసుకుని మైదానంలోకి దిగిన పొలార్డ్ తన నిరసనని తెలియజేశాడు. ఈ సంవత్సరం ఐపీఎల్ టైమ్ లోనూ ఫీల్డ్ అంపైర్ వైడ్ ఇవ్వకపోవడంతో తర్వాత బంతి కోసం వికెట్లని విడిచి వైడ్ లైన్ పైకి వెళ్లి మరీ బ్యాటింగ్ కు సిద్ధమయ్యాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అంపైర్ల తప్పిదాల కారణంగా పొలార్డ్ గొడవపడిన సందర్భాలు చాలా చాలా ఉన్నాయనే చెప్పవచ్చు.
మైదానంలో అంపైర్ ని ఆడుకునే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోని పొలార్డ్ మరోసారి ఫీల్డ్ అంపైర్ కి ఊహించని ట్విస్ట్ చూపించాడు. అఫ్గానిస్థాన్ తో లక్నో వేదికగా తాజాగా జరిగిన మూడో వన్డేలో బౌలింగ్ చేసిన కీరన్ పొలార్డ్, ఒక బంతిని క్రీజు వెలుపల పాదం ఉంచి విసరబోయాడు. దీనితో వెంటనే ఫీల్డ్ అంపైర్ ఆ బంతిని నోబాల్ గా ప్రకటించాడు. కానీ అంపైర్ నోటి నుంచి నోబాల్ అని రాగానే క్షణాల వ్యవధిలో బంతి విసరడాన్ని పొలార్డ్ నిలిపేశాడు. దీనితో కంగుతిన్న అంపైర్ తన నోబాల్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, ఆ బాల్ ను డెడ్ బాల్ గా ప్రకటించాడు. మీడియం పేసరైన పొలార్డ్, అంపైర్ నోటి వెంట నోబాల్ అని రాగానే బంతిని విసరకుండా నియంత్రించుకోడంపై అతని పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేశారు. ఆ జట్టులో ఓపెనర్ హజ్రతుల్లా (50: 59 బంతుల్లో 7x4, 2x6), అస్గర్ అఫ్గాన్ (86: 85 బంతుల్లో 3x4, 6x6), మహ్మద్ నబీ (50 నాటౌట్: 66 బంతుల్లో 3x4, 1x6) హాఫ్ సెంచరీలతో బ్యాట్స్ కి పన్ని చెప్పారు. అనంతరం లక్ష్యాన్ని
వెస్టిండీస్ జట్టు షైహోప్ (109 నాటౌట్: 145 బంతుల్లో 8x4, 3x6) సెంచరీ బాదడంతో 48.4 ఓవర్లలోనే 253/5 స్కోర్ తో విజయం సాధించారు. ఈ సిరీస్ కి
వెస్టిండీస్ కెప్టెన్ గా కీరన్ పొలార్డ్ గా ఉన్నాడు.