
విశాఖలో జరిగిన రెండో వన్డేలో టీమిండియా విండీస్‌పై 107 పరుగుల తేడాతో నెగ్గి 3 వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. 388 పరుగుల లక్ష్య చేదనతో బరిలోకి దిగిన విండీస్ 43.3 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌటైంది. విండీస్ బ్యాట్స్‌మెన్‌లో ఓపెనర్ షై హోప్ 78 పరుగులు, నికోలస్ పూరన్ 75 పరుగులతో రాణించారు. భారత బౌలరల్లో చైనామెన్ కల్దీప్ యాదవ్ హ్యాట్రిక్‌తో మెరవగా, మహ్మద్ షమీ 3వికెట్లు, రవీంద్ర జడేజా 2వికెట్లు, శార్దుల్ ఠాకూర్ ఒక వికెట్ పడగొట్టారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్‌లు శతకాలతో మెరవగా, మిడిలార్డర్లో రిషబ్‌పంత్, శ్రేయాస్ అయ్యర్లు దాటిగా ఆడి భారీ స్కోరుకు బాటలు వేశారు. విండీస్ బౌలర్లలో కాట్రెల్, కైరీ పియరీ 2 వికెట్లు పడగొట్టారు.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడి వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీం ఇండియా యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. అయతే ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడ్డ జట్టుకు హోప్, పూరన్‌ల జోడీ అండగా నిలిచింది. వీరిద్దరు కలిసి నాలుగో వికెట్‌కి 106 పరుగులు జోడించారు. ఆ తర్వాత షమీ వేసిన 30వ ఓవర్లో పూరన్, పొలార్డ్ వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు.
అనంతరం కుల్దీప్ యాదవ్ వెస్టిండీస్‌కి ఝలక్ ఇచ్చాడు. కుల్దీప్ యాదవ్ వేసిన 33వ ఓవర్లో అతను హ్యాట్రిక్ సాధించాడు. తొలుత క్రీజ్ వద్ద స్థిరపడ్డ షాయ్ హోప్(78)ని పెవిలియన్ పంపిన కుల్దీప్. ఆ తర్వాత వరుస బంతుల్లో జేసన్ హోల్డర్, అల్జరీ జోసెఫ్‌లను డ్రెస్సింగ్ రూం బాటపట్టించాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్లో రెండు హ్యాట్రిక్‌లు సాధించిన తొలి బౌలర్‌గా అతను రికార్డు సృష్టించాడు. భారత బౌలర్ల దెబ్బకి వెస్టిండీస్ 34 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. క్రీజ్‌లో పైర్రే(4), కీమో పాల్(1) ఉన్నారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే.. వెస్టిండీస్ ఇంకా 177 పరుగులు చేయాల్సి ఉంది.
టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ కెప్టెన్, ఆల్ రౌండర్ కీరోన్ పొలార్డ్ ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరాడు. నికోలస్ పూరన్(75; 47 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌కు బ్రేక్ పడిన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన పొలార్డ్ ఆడిన తొలి బంతికే పెవిలియన్ చేరాడు. మహ్మద్ షమీ వేసిన 30 ఓవర్ రెండో బంతికి పూరన్ ఔట్ కాగా, ఆ మరుసటి బంతికి పొలార్డ్ ఔటయ్యాడు. ఆఫ్ స్టంప్‌పైకి వేసిన గుడ్ లెంగ్త్ బాల్‌ను ఆడబోయిన పొలార్డ్.. అది కాస్తా ఎడ్జ్ తీసుకోవడంతో కీపర్ రిషభ్ పంత్ చేతుల్లో పడింది. దాంతో పొలార్డ్ ఇన్నింగ్స్ సున్నాకే ముగిసింది.
అంతకుముందు పూరన్ ధాటిగా బ్యాటింగ్ చేసి విండీస్ స్కోరు బోర్డును పరుగులు తీయించాడు. అతని వ్యక్తిగత స్కోరు 22 పరుగుల వద్ద ఉండగా జడేజా బౌలింగ్‌లో ఇచ్చిన క్యాచ్‌లను దీపక్ చాహర్ వదిలేయడంతో బతికిపోయిన పూరన్ రెచ్చిపోయాడు. అయితే బ్యాట్ ఝుళిపించే క్రమంలో షమీ తెలివిగా బౌన్స్ వేయగా దాన్ని పూరన్ హిట్ చేశాడు. అది కాస్తా లాంగ్ లెగ్‌లో క్యాచ్‌గా లేవడంతో అక్కడకు కాస్త దూరంలో ఫీల్డింగ్ చేస్తున్న కుల్దీప్ యాదవ్ దాన్ని పరుగెత్తుకుంటూ వచ్చి అందుకున్నాడు. దాంతో పూరన్ భారంగా పెవిలియన్ చేరాడు. ఆపై క్రీజ్‌లోకి వచ్చిన పొలార్డ్‌ను చక్కటి బంతితో షమీ బోల్తా కొట్టించాడు. వెంటవెంటనే రెండు వికెట్లు సాధించడంతో టీమిండియా శిబిరంలో ఆనందంలో మునిగిపోయింది. కాగా, వన్డే చరిత్రలో ఒకే మ్యాచ్‌లో ఇద్దరు కెప్టెన్లు గోల్డెన్ డక్‌గా వెనుదిరగడం ఇదే తొలిసారి.