రిషబ్ పంత్ ఎన్నో అంచనాల మధ్య టీమిండియా లోకి ఎంట్రీ ఇచ్చిన యువ ఆటగాడు. రిషబ్ పంత్ స్టైల్ ఆట మొత్తం ధోని స్టైల్ లో ఉండటంతో ధోని వారసుడిగా టీమిండియాలో రిషబ్ పంత్ మారిపోతాడు అని అందరూ భారీ అంచనాలు పెట్టుకున్నారు. వికెట్ కీపింగ్ లో కూడా ధోని మెళుకువలు నేర్చుకొని... అద్భుతంగా రాణిస్తాడు అని అందరూ అనుకున్నారు. టీమిండియాలో కీలక బ్యాట్స్మెన్ గా ఎదిగి మిడిల్ ఆర్డర్లో టీమ్ ఇండియాకు ఉన్న కొరతని తీరుస్తాడు అని అందరూ ఆశలు పెట్టుకున్నారు. కానీ రిషబ్ పంత్ మాత్రం అంచనాలనుఅందుకోవటంలో లేదు.. ధోని వారసుడు అనుకున్నప్పటికీ అంత స్థాయి ఆట ప్రదర్శన చేయడం లేదు రిషబ్ పంత్. ఇప్పటికే ఏ ఆటగాడికి లేనని అవకాశాలు రిషబ్ పంత్ కు వచ్చాయి... రిషబ్ పంత్ అవకాశాన్ని వినియోగించుకున్నట్లే ఉంటుంది కానీ... చివర్లో అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉంటాడు.
అటు కీపింగ్ లో కూడా మొదట్లో అతడు తడపడినప్పటికీ ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం సెట్ అవుతున్నాడు . దీంతో అటు క్రికెట్ అభిమానులు కూడా రిషబ్ పంత్ పై తీవ్ర విమర్శలు కూడా చేస్తున్నారు . అటు బిసిసీఐ అధికారులు కూడా రిషబ్ పంత్ ఆటతీరుపై అంతగా సంతృప్తిగా లేనట్లు తెలుస్తోంది. ధోని వారసుడిగా అంచలంచలుగా ఎదిగి.. టీమిండియాకు ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న మిడిలార్డర్ కొరతను భర్తీ చేస్తాడు అని అందరూ... అనుకుంటే రిషబ్ పంత్ మాత్రం వరుసగా అన్ని మ్యాచుల్లో పేలవ ప్రదర్శన చేస్తూ విమర్శలకు గురి అవుతున్నాడు.
ముఖ్యంగా గత కొంతకాలంగా రిషబ్ పంత్ బ్యాటింగ్ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రిషబ్ పంత్ కు ఎన్ని అవకాశాలు వచ్చినప్పటికీ సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం లేదు అని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రిషబ్ పంత్ ను టీమిండియా జట్టు నుంచి తప్పించాలని సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. రేపటి నుంచి న్యూజిలాండ్తో జరిగే టి20 సిరీస్ లో రిషబ్ పంత్ స్థానంలో కె.ఎల్.రాహుల్ కీపర్ గా తీసుకోవాలని టీమ్ ఇండియా యాజమాన్యం భావిస్తోందట. ఈ మేరకు కె.ఎల్.రాహుల్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను కూడా బీసీసీఐ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. దీంతో వికెట్ కీపర్ గా కేఎల్ రాహుల్ కు అవకాశం ఇస్తే మరి పంత్ పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.