టీమిండియా జట్టు.. కోహ్లీ సారథ్యంలో మునుపెన్నడూ లేని విధంగా ఎంతో పటిష్టంగా మారి ప్రత్యర్థి జట్లు  అన్నింటినీ చిత్తు చేస్తూ... సంచలన విజయాలను నమోదు చేస్తూ వరుస సిరీస్  లని గెలుచుకుంటూ  దూసుకుపోతోంది. ఓవైపు బ్యాటింగ్ లో  మరోవైపు బౌలింగ్లో ఎంతో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ టీమిండియాకు ఎవరు సాటి లేరు అని నిరూపిస్తుంది. ఇక ప్రస్తుతం టీమిండియా న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతున్న దూకుడుకు బ్రేక్ పడింది అని చెప్పాలి. మొదట న్యూజిలాండ్తో జరిగిన టి20 సిరీస్ లో కూడా సత్తా చాటింది టీమిండియా. వరుసగా ఐదు సిరీస్లను గెలుచుకొని తమ సత్తా ఏంటో చూపించింది. 

 

 

 ఈ నేపథ్యంలో టీమిండియాపై ఎన్నో ప్రశంసలు కూడా వచ్చాయి. ఇక ఆ తర్వాత జరిగిన వన్డే మ్యాచ్లో మాత్రం టీమిండియా సిరీస్ను దక్కించుకోలేకపోయింది. టీమ్ ఇండియా మొత్తం సమిష్టిగా విఫలం అయింది అని చెప్పాలి. ఓవైపు బ్యాట్ మెన్స్ మరోవైపు బౌలర్లు ఎవరూ రాణించలేక... వన్డే సిరీస్లో జరిగిన మూడు మ్యాచ్ లు  ఓడిపోయి క్లీన్స్వీప్ ఐపోయింది. దీంతో అందరూ షాక్ కి గురయ్యారు. వరుస సిరీస్ను గెలుచుకుంటూ  పోతూ సత్తా చాటుతున్న టీమిండియా..మరి  ఇంత ఘోర పరాభవాన్ని మూటకట్టుకోవడం ఏమిటి అని కంగుతిన్నారు క్రికెట్ ప్రేక్షకులు. ఇక ఆ తర్వాత ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్లో కూడా టీమిండియా తీరు మారటం లేదు. 

 

 

 మొన్నటికి మొన్న జరిగిన మొదటి టెస్టు సిరీస్లో మరోసారి పేలవ ప్రదర్శన చేసి విజయం అంచుల వరకూ కూడా వేల లేకపోయింది కోహ్లీసేన. ఈ నేపథ్యంలో విమర్శకులు తమ నోటికి పని చెబుతారు. న్యూజిలాండ్ పర్యటనలో తొలి టి20 సిరీస్ లో విజృంభించిన కోహ్లీసేన కు ఆ తర్వాత నాలుగు వారాలు న్యూజిలాండ్ టూర్ గా మారిపోయింది అంటూ ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ అన్నారు. కివీస్తో టెస్ట్ సిరీస్ ఆడటానికి టీమిండియా ఇంకా ఇబ్బంది పడుతుందని... సీమింగ్ బంతులు ఎలా  ఎదుర్కోవాలో... కోహ్లీ సేన ప్రాక్టీస్ చేయాలని లేకపోతే రెండవ టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోవడం ఖాయం అంటూ ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ అన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: