ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను కరోనా వైరస్ గజగజా వణికిస్తోన్న విషయం తెలిసిందే. కరోనాకు వ్యాక్సిన్ లేకపోవడంతో వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు పలు దేశాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. లాక్ డౌన్ వల్ల సెలబ్రిటీలు, క్రీడాకారులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాడు దేవిడ్ వార్నర్ లాక్ డౌన్ వల్ల ఇంటికే పరిమితమై తన కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నారు.
తన కూతుళ్లతో ఆడుకుంటూ, డ్యాన్స్ చేస్తూ అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వార్నర్ బాలీవుడ్ లో సూపర్ హిట్టైన షీలా కీ జవానీ పాటకు కూతుళ్లతో కలిసి డ్యాన్స్ చేశారు. వార్నర్ కూతుళ్లు భారతీయ వస్త్రధారణలో అద్భుతంగా డ్యాన్స్ చేశారు. నిన్న సాయంత్రం వార్నర్ ఇన్స్టాగ్రామ్లో డ్యాన్స్ వీడియోలను పోస్ట్ చేశారు. వార్నర్ అభిమానులు వీడియోలను లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.
నెటిజన్లు వార్నర్ కూతుళ్లు ఎంతో క్యూట్ గా డ్యాన్స్ చేశారని ప్రశంసించారు. ఒక నెటిజన్ వార్నర్ భారత్ ను మిస్సవుతున్నాడని తనకు అనిపిస్తోందని... అయినా లాక్ డౌన్ అమలవుతూ ఉండటంతో ఏం చేయలేమని స్పందించారు. వార్నర్ మరో పోస్ట్ లో తన జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ లో టైటిల్ గెలవడం అద్భుతమైన జ్ఞాపకమని చెప్పారు. టోర్నీకి 12 ఏళ్లు నిండటంతో వార్నర్ తన అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు.
మరోవైపు సినీ ప్రముఖులు, స్పోర్ట్స్ సెలబ్రిటీలు కూడా వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేస్తూ అభిమానులతో నిత్యం టచ్ లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు వంటలకు సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేస్తే మరికొందరు కరోనా భారీన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచిస్తున్నారు. లాక్ డౌన్ వల్ల నిత్యం బిజీగా ఉండే సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితం కావడం గమనార్హం.
View this post on InstagramIndi has asked to also do one for you guys! 😂😂 please help me someone!!!!!! #statue