దుబాయ్ వేదికగా ఐపీఎల్ రెండో మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్... కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన విషయం తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. రెండు జట్లు తాము ఎక్కడ తక్కువ కాదు అని నిరూపించుకొన్నాయి. ఏకంగా  మ్యాచ్  టై అయ్యింది . ఇక మ్యాచ్ టైగా ముగియడంతో సూపర్ ఓవర్ లో ఫలితం తేలాల్సి వచ్చింది. కాని అంతకు ముందు  అంపైర్ తప్పిదం కారణంగా ఏకంగా  మ్యాచ్ ఫలితం మొత్తం తారుమారైంది. గెలవాల్సిన పంజాబ్ కాస్త చివరికి ఓటమిపాలైంది. పంజాబ్ విజయానికి పది బంతుల్లో 21 రన్స్  అవసరమైన దశలో.. రబడా  వేసిన బంతిని స్ట్రైక్ లో ఉన్న మయాంక్ అగర్వాల్ కవర్ దిశగా బాదాడు.



క్రమంలోని రెండు పరుగులు తీశాడు మయాంక్ అగర్వాల్. కానీ  అంపైర్ గా ఉన్న జోర్డాన్ బ్యాట్ ని  గ్రీస్ లో ఉంచ లేదనే కారణంతో ఏకంగా ఒక పరుగు కోత విధించాడు. అంపైర్ తప్పిద  నిర్ణయం ఏకంగా  మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. దీంతో అంపైర్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంజాబ్ జట్టుకు మెంటర్ గా వ్యవహరిస్తున్న వీరేంద్ర సెహ్వాగ్ అంపైర్ నిర్ణయంపై ఘాటుగా స్పందించారు. మాన్ అఫ్ ది మ్యాచ్ ఆటగాళ్లకు కాదు తప్పిదం నిర్ణయంతో మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిన అంపైర్ కి  ఇవ్వాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.



 అంతేకాదు మ్యాచ్ లో  షార్ట్ రన్  సమయంలో జరిగిన అసలు విషయాన్ని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై బాలీవుడ్ నటి ప్రీతి జింటా కూడా స్పందించారు. కింగ్స్ ఎలెవన్  పంజాబ్ మ్యాచ్ లను  తిలకించేందుకు ఎంతోసంతోషంగా యూఏఈ చేరుకున్నానని..  ఆరు రోజులు కూడా క్వారంటైన్ లో గడిపాను అంటూ తెలిపారు. ఇవన్నీ చిరునవ్వుతోనే చేశాను కానీ ఒక్క షార్ట్ రన్  తనపై ఎంతో బలంగా ప్రభావం చూపింది నిరాశ వ్యక్తం చేశారు. వాడుకో లేనప్పుడు టెక్నాలజీ ఎందుకు అంటూ బీసీసీఐ అధికారిక  ఖాతాను ట్యాగ్  చేశారు ప్రీతిజింటా. ఇక అంపైర్ తప్పుడు నిర్ణయం పై ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: