కానీ ఎవరూ ఊహించని విధంగా టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ తన అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికగానే... సురేష్ రైనా కూడా భావోద్వేగంతో రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే సురేష్ రైనా నిర్ణయం అనాలోచిత నిర్ణయం అని క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎందుకంటే ప్రస్తుతం టీమిండియా లో ఇప్పటికి కూడా మిడిల్ ఆర్డర్ సమస్య వేధిస్తూనే ఉంది. సురేష్ రైనాకు జట్టులోకి వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. కానీ సురేష్ రైనా అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకడంతో... ఇక అవకాశమే లేదు.
ఇక ఆ తర్వాత ఐపీఎల్ లో అయినా రాణించి సత్తా ఏంటో చూపుతాడు అని అభిమానులు అనుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా సీఎస్కే జట్టు నుంచి సురేష్ రైనా నిష్క్రమించాడు. కుటుంబ సమస్యలు వల్లే తప్పుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు రైనా. ఇక మళ్ళీ వస్తానని రైనా సంకేతాలు ఇచ్చినప్పటికీ సిఎస్ కే యాజమాన్యం నుంచి మాత్రమే రైనా కు పిలుపు రాలేదు అన్నది వినిపిస్తున్న మాట. అయితే ఈ సీజన్ సరే వచ్చే సీజన్లో అయినా రైనా కు ఛాన్స్ ఉంటుందా లేదా అని సరికొత్త అనుమానం మొదలయ్యింది. ఇక ప్రస్తుతం ఇదే విషయంపై సురేష్ రైనా కూడా అంతర్మథనం మునిగిపోయినట్లు తెలుస్తోంది.